రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ సంగనేర్ ప్రాంతంలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం, ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
తెల్లవారుజామున పాల వ్యాపారం కోసం స్కూటర్‌పై వెళ్తున్న 57 ఏళ్ల వ్యక్తిని, అతివేగంగా దూసుకొచ్చిన ఎస్‌యూవీ (SUV) కారు ఢీకొట్టడంతో ఆయన దుర్మరణం చెందాడు.
సంగనేర్ ప్రాంతానికి చెందిన నవల్ శర్మ గత శనివారం ఉదయం యధావిధిగా తన స్కూటర్‌పై పాల వ్యాపారానికి బయలుదేరాడు. ఓ రెస్టారెంట్ సమీపంలోని హనుమాన్ ఆలయం వద్ద వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా దూసుకొచ్చిన నలుపు రంగు మహీంద్రా థార్ ఎస్‌యూవీ కారు అతని స్కూటర్‌ను అత్యంత బలంగా ఢీకొట్టింది.
కారు బలంగా ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడిన నవల్ శర్మ తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కుప్పకూలిపోయాడు. ప్రమాదానికి కారణమైన కారును ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి కళ్లుగప్పి పరారయ్యాడు. శబ్దాలు విని పరుగెత్తుకొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.
ఆసుపత్రిలో శర్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, గత ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనా స్థలం చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరా దృశ్యాలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన థార్ కారు పారిపోయిన మార్గం, అందులో ప్రయాణించిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Leave a Reply