ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగిస్తోంది. మంచాన పడి ఉన్న 70 ఏళ్ల వృద్ధురాలిని ఆమె కొడుకే అతి దారుణంగా కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. నెటిజన్లు ఈ ఘటనను “కలియుగ అంతం”గా అభివర్ణిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఘటన వివరాలు: వైరల్ అయిన సిసిటివి (CCTV) ఫుటేజీలో, ఒక వృద్ధురాలు మంచంపై నిస్సహాయంగా పడుకుని ఉండగా ఆమె కొడుకు ఆమె దగ్గరకు వచ్చాడు. మొదట వారు మాట్లాడుకుంటున్నట్లు అనిపించినా, ఒక్కసారిగా ఆ వ్యక్తి హింసాత్మకంగా మారి తల్లిని కొడుతూ, జుట్టు పట్టి లాగుతూ, గొంతు నులిమాడు. ఆ వృద్ధురాలు తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, అతను ఆమె మందులను విసిరేసి గదిలో గందరగోళం సృష్టించాడు.
నిందితుడి అరెస్ట్: ఈ వీడియో వైరల్ కావడంతో ఘాజీబాద్ పోలీసులు వేగంగా స్పందించారు. నిందితుడిని 44 ఏళ్ల నిశాంత్ ఠాకూర్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అమెరికాలో ఉంటున్న అతని సోదరి, తన తల్లి భద్రత కోసం ఇంట్లో ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరా ద్వారా ఈ దారుణాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించింది.
