భారతదేశ జనాభా వేగంగా పెరుగుతోంది, అదే సమయంలో ప్రజల్లో అవగాహన కూడా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ముగిసిన వాలెంటైన్ వీక్ దీనికి నిదర్శనంగా నిలిచింది. సాధారణంగా ఈ వారంలో పూలు, చాక్లెట్లు, బహుమతులు ఎక్కువగా అమ్ముడవుతాయి. కానీ, ఈ ఏడాది వీటన్నింటినీ మించి కాండోమ్స్ మరియు ఇతర ‘సెక్సువల్ వెల్నెస్’ ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పెరిగాయి.
2025 రికార్డు బద్దలు: క్విక్ కామర్స్ (బ్లింకిట్, జెప్టో వంటి యాప్స్) తాజా నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 7 నుండి 14 మధ్య జరిగిన అమ్మకాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 2025తో పోలిస్తే ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజున సెక్సువల్ వెల్నెస్ ఉత్పత్తుల కొనుగోలు 3 రెట్లు పెరిగింది. గతంలో ఇలాంటి విషయాల గురించి బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడని ప్రజలు, ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వీటిని ఆర్డర్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
బ్యూటీ మరియు పర్సనల్ కేర్: కేవలం వెల్నెస్ ఉత్పత్తులే కాకుండా, మేకప్ మరియు బాడీ కేర్ ఉత్పత్తుల అమ్మకాలు కూడా జోరుగా సాగాయి. సూరత్‌కు చెందిన ఒక కస్టమర్ ఏకంగా ₹10,845 విలువైన హెయిర్ కేర్ మరియు బాడీ కేర్ ఉత్పత్తులను ఆర్డర్ చేయగా, మరొకరు ₹15 వేల కంటే ఎక్కువ విలువైన మేకప్ వస్తువులను కొనుగోలు చేశారు.
నగరాల వారీగా సందడి:
- కోల్‌కతా: ఒక కస్టమర్ ఏకంగా ₹25 వేల విలువైన చాక్లెట్లను ఆర్డర్ చేశారు.
- టెడ్డీ డే: సాఫ్ట్ టాయ్స్ (టెడ్డీ బేర్స్) అమ్మకాలు 568 శాతం పెరిగాయి.
- బెంగళూరు: వాలెంటైన్ కార్డ్స్ కొనుగోలులో బెంగళూరు నగరం ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచింది.
