పెద్ద చిక్కుల్లో పడబోతున్న భారత్! అమెరికాతో చేతులు కలపడం వల్ల ముంచుకొస్తున్న ముప్పు?

ఇరాన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం మనమంతా ఎల్పీజీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత గురించి చర్చించుకుంటున్నాం. అయితే, మరో ఒకటి రెండు నెలల్లో అంతకంటే పెద్ద సమస్యలో భారత్ చిక్కుకోబోతోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అదే ‘విదేశీ మారక ద్రవ్య నిల్వల’ (Foreign Exchange Reserves) సమస్య. అమెరికా ఆదేశాల మేరకు, రష్యా నుండి రూపాయిల్లో కొనుగోలు చేస్తున్న కచ్చా చమురును కేంద్ర ప్రభుత్వం నిలిపివేసి.. అమెరికన్ డాలర్లను చెల్లిస్తూ గల్ఫ్ దేశాల నుండి చమురును కొనడం ప్రారంభించింది.

వేచి ఉన్న సమస్య: నిరంతరం చమురు కొనాలంటే అమెరికన్ డాలర్లు చాలా అవసరం. ప్రస్తుతం మన వద్ద సుమారు 700 బిలియన్ డాలర్ల నిల్వలు మాత్రమే ఉన్నాయి. వీటితో మరో 7-8 నెలలు మాత్రమే నెట్టుకురాగలం. మనం ప్రతిరోజూ విదేశాలకు వస్తువులను ఎగుమతి చేస్తున్నాం కదా, దాని ద్వారా ఆదాయం వస్తూనే ఉంటుంది కదా అని మీరు అడగవచ్చు. కానీ, ఈ ఎగుమతులపైనే అమెరికా ఇప్పుడు దెబ్బకొట్టింది.

అమెరికాను నమ్మి.. ఇజ్రాయెల్ మాటలు విని అమెరికా ఇరాన్‌పై దాడి చేయగా, ప్రతిగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. సాధారణంగా ఇటువంటి అంతర్జాతీయ విషయాల్లో భారత్ ‘అలీన విధానాన్ని’ (Non-Aligned Policy) పాటిస్తుంది. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమెరికాకు మద్దతుగా నిలిచి ఇరాన్‌తో వైరం తెచ్చుకుంది. ఇది మన ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఎగుమతులకు ఆటంకం: అమెరికా తర్వాత భారత వస్తువులు ఎక్కువగా వెళ్లేది గల్ఫ్ దేశాలకే. మన మొత్తం ఎగుమతుల్లో 15-18% వాటా గల్ఫ్ దేశాలదే. ఈ దేశాలకు మన వస్తువులు వెళ్లాలంటే ‘హార్ముస్ జలసంధి’ ఏకైక మార్గం. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీనికి తోడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల (Taxes) వల్ల భారత్ ఇప్పటికే నష్టపోతోంది.

అసలు సమస్య ఇదే: భారతదేశ దిగుమతులు 915 బిలియన్ డాలర్లు కాగా, ఎగుమతులు 821 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే వాణిజ్య లోటు 94 బిలియన్ డాలర్లు. మన ఎగుమతుల్లో 18% అమెరికాపైనే ఆధారపడి ఉన్నాం, కానీ పన్నుల వివాదం వల్ల ఆ వ్యాపారంలో 40% దెబ్బతింది. మరోవైపు ఇరాన్ యుద్ధం కారణంగా మన దేశీయ ఉత్పత్తి కూడా కుంటుపడింది.

వీటన్నింటి వల్ల భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మరో రెండు నెలల్లో ఈ సమస్య తీవ్రరూపం దాల్చవచ్చు. దీనికి పూర్తి కారణం ట్రంప్ మరియు ఆయనను నమ్మిన కేంద్ర ప్రభుత్వమేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Posted

in

by

Tags: