“పెద్ద బ్రాండ్ అని నమ్మి వస్తే ఇలాంటి కుళ్లిపోయిన చికెన్ పెడతారా?!” KFC రెస్టారెంట్‌లో అధికారుల మెరుపు దాడులు… ఏకంగా 640 కిలోల కుళ్లిన మాంసం సీజ్!

ప్రముఖ అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం కేఎఫ్‌సీ (KFC) ఔట్‌లెట్‌పై ఆహార భద్రతా శాఖ (Food Safety) అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో దాదాపు 640 కిలోల కుళ్లిపోయిన మాంసం, బూజు పట్టిన కూరగాయలు పట్టుబడటం తీవ్ర దిగ్భ్రాంతిని, అసహ్యాన్ని కలిగించింది.

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బ్రాండ్ అన్న నమ్మకంతో పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే చోట.. అత్యంత దారుణమైన అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్న వైనం అధికారుల దాడుల్లో బట్టబయలైంది.

రెస్టారెంట్ కిచెన్, ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన చికెన్ ఎన్నో రోజుల నాటిదై, దుర్వాసన వస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. వంటల కోసం ఉంచిన కూరగాయలపై తెల్లటి బూజు పట్టి, కనీసం తినడానికి కూడా పనికిరాని దుస్థితిలో ఉండటం చూసి అధికారులే విస్తుపోయారు. ఇలాంటి కుళ్లిన, నాసిరకం ముడిసరుకులతోనే కస్టమర్లకు రకరకాల వంటకాలు చేసి వడ్డిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది.

దీంతో అక్కడ దొరికిన 640 కిలోల కుళ్లిన మాంసం, పాడైపోయిన ఇతర ఆహార పదార్థాలను అధికారులు వెంటనే సీజ్ చేసి ధ్వంసం చేశారు. అలాగే సదరు రెస్టారెంట్ యాజమాన్యంపై ఆహార భద్రతా చట్టం కింద కఠిన కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేశారు.

భారీగా బిల్లులు వసూలు చేసే ఇలాంటి మల్టీనేషనల్ బ్రాండ్లు.. కస్టమర్ల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారి ప్రాణాలతో, ఆరోగ్యంతో చెలగాటమాడటంపై నెటిజన్లు, వినియోగదారులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: