పెళ్లయిన 10 రోజులకే భర్త పరాయి ఊరికి.. నెలన్నరలోనే భార్య గర్భం.. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ప్రసవించిన వైనం: తీవ్ర కలకలం!

బారాబంకి ప్రాంతంలో, పెళ్లయిన కేవలం 10 రోజులకే సూరజ్ అనే యువకుడు ఉపాధి కోసం గుజరాత్ వెళ్లాడు.

అయితే, నెలన్నర రోజుల తర్వాత తన భార్య గర్భవతి అయిందన్న వార్త విని అతను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఈ విషయం తెలియగానే వెంటనే స్వగ్రామానికి చేరుకున్న సూరజ్, భార్య గర్భం దాల్చడం వెనుక ఉన్న అసలు కారణాలను ఆరా తీయడం మొదలుపెట్టాడు.

తన గ్రామానికే చెందిన బబ్లూ అనే యువకుడితో భార్యకు వివాహేతర సంబంధం ఉందని సూరజ్ ఆరోపిస్తున్నాడు. అయితే, బబ్లూ తనపై బలవంతానికి పాల్పడ్డాడని, పరువు పోతుందన్న భయంతో పాటు సమాజానికి భయపడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేకపోయానని ఆ మహిళ వాపోతోంది.

భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రరూపం దాల్చడంతో వ్యవహారం కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఇరువర్గాలను విచారిస్తుండగానే, ఆ మహిళకు అకస్మాత్తుగా నొప్పులు మొదలై ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఆలయం సమీపంలోనే ఆ మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆమెను మహిళా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, ఇరువర్గాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి రాజీ కుదరలేదు.


Posted

in

by

Tags: