పెళ్లయిన 20 రోజులకే ఘోరం.. వదిన అని చూడకుండా మరిది అరాచకం.. భార్యను బెదిరించి నోరు మూయించిన భర్త!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బరేలీ జిల్లాలో పెళ్లయిన కేవలం 20 రోజులకే ఒక నవ వధువు తన మరిది చేతిలో అత్యాచారానికి గురైన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగిందంటే? బాధిత మహిళకు గతేడాది డిసెంబర్ 11న వివాహం జరిగింది. జనవరి 1వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, ఆమె మరిది ఈ దారుణానికి ఒడిగట్టాడు. జరిగిన అన్యాయం గురించి ఆ మహిళ తన భర్తకు వివరిస్తూ ఏడ్చి గోడు వెళ్లబోసుకుంది. అయితే, భర్త ఆమెను ఓదార్చాల్సింది పోయి, “ఈ విషయం బయటకు చెబితే నేను ఆత్మహత్య చేసుకుంటాను” అని బెదిరించి ఆమె నోరు మూయించాడు.

భర్త బెదిరింపులకు భయపడి కొంతకాలం మౌనంగా ఉన్న ఆ మహిళ, ఆ తర్వాత ధైర్యం చేసి నిలదీయగా.. భర్త, అత్త మరియు మరిది ముగ్గురూ కలిసి ఆమెపై దాడి చేసి బెదిరించారు. వీరి వేధింపులు భరించలేక చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం బరాదరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సామాజిక అవమానానికి భయపడకుండా నేరస్థులకు కఠిన శిక్ష పడాలని ఆ మహిళ పట్టుదలతో ఉంది.


Posted

in

by

Tags: