లక్నో: “నేను ఇతనితో కలిసి జీవించలేను.. నన్ను నా ప్రియుడితో కలిపి ఉంచకపోతే చచ్చిపోతాను!” అంటూ ఉత్తరప్రదేశ్‌లో ఒక నవవధువు తెల్లవారుజామున అత్తగారింటి నుండి తప్పించుకుని, నేరుగా ప్రియుడి ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన షాకింగ్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక యువతికి, యువకుడికి గత 8 రోజుల క్రితమే అత్యంత వైభవంగా వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన మొదటి రోజే తన భర్త నపుంసకుడంటూ సదరు పెళ్లికూతురు ఇంట్లో పెద్ద గొడవకు దిగింది. అంతేకాకుండా, తెల్లవారుజామునే అత్తగారింటి నుండి ఎస్కేప్ అయ్యి మొదట పుట్టింటికి.. అక్కడి నుండి నేరుగా తన ప్రియుడి ఇంటికి పరుగు తీసింది.
దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వధువు తరపు కుటుంబ సభ్యులు.. అటు భర్త, ఇటు ప్రియుడి కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రామ పెద్ద (సర్పంచ్) ఆధ్వర్యంలో అత్యవసర పంచాయితీని ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ప్రారంభమై తెల్లవార్లజాము వరకు దాదాపు 12 గంటల పాటు నిరంతరాయంగా సాగిన ఈ మెగా పంచాయితీ చివర్లో.. అర్ధరాత్రి సమయంలోనే భార్యాభర్తలిద్దరికీ అధికారికంగా విడాకులు ఇప్పించారు.
అర్ధరాత్రి వేళ ప్రియుడితో పెళ్లి.. అయితే అక్కడితో కథ ముగిసిపోలేదు.. అంతకంటే పెద్ద విచిత్రం ఏంటంటే, విడాకులు పూర్తయిన తదుపరి కొన్ని నిమిషాల్లోనే అర్ధరాత్రి వేళ అత్యవసరంగా ఒక ‘కాజీ’ (ముస్లిం వివాహ పెద్ద) ని అక్కడికి రప్పించారు. ఆ పంచాయితీ వేదికపైనే ప్రియుడితో సదరు యువతికి నిమిషాల వ్యవధిలో పునర్వివాహం (రెండో పెళ్లి) జరిపించి అక్కడి నుండి పంపించి వేశారు. దేశంలోనే అత్యంత అరుదుగా జరిగిన ఈ వింత వివాహ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో నెటిజన్ల మధ్య ఒక హాట్ టాపిక్‌గా మారి పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది.

Leave a Reply