“నిద్ర కంటే ఇదే మిన్న!”. భారతీయ రైలులో కెనడా పర్యాటకులకు దక్కిన సర్‌ప్రైజ్.. మనసుని హత్తుకునే వీడియో వైరల్..!!

భారతదేశానికి వచ్చిన కెనడా పౌరులకు భారతీయ రైలు ప్రయాణం ఒక మరపురాని జ్ఞాపకంగా మిగిలిపోయింది. వీరు పొరపాటున స్లీపర్ క్లాస్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు, కానీ ఆ పొరపాటే వారికి ఎన్నో మధుర అనుభూతులను మిగిల్చింది.

కెనడా పౌరురాలు కిమ్ గ్రీన్ వుడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన రైలు ప్రయాణానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భారతీయ రైల్వే ‘కమ్యూనిటీ’ మనసు గెలుచుకుంది: కిమ్ గ్రీన్ వుడ్ వీడియోలో వివరిస్తూ.. తాము మరింత సౌకర్యంగా ఉండవచ్చని భావించి పొరపాటున స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. జలగావ్ జంక్షన్ నుండి చంద్రపుర వరకు 7 గంటల ప్రయాణంలో వారు ఊహించని అనుభవాలను ఎదుర్కొన్నారు.

“మేము ప్రశాంతంగా నిద్రపోతూ వెళ్లవచ్చని స్లీపర్ క్లాస్ బుక్ చేశాం. కానీ భారతదేశంలోని వివిధ రకాల రైలు తరగతుల (Classes) గురించి మేము ఇంకా చదవాల్సి ఉందని అర్థమైంది. ఇక్కడ స్లీపర్ క్లాస్ అంటే మీకు ఒక బెర్త్ దొరుకుతుంది కానీ, ఆ ప్రదేశం అంతా ఒక కమ్యూనిటీ (సమూహం)కి చెందినదిగా మారుతుంది” అని ఆమె పేర్కొన్నారు.

ప్రయాణాన్ని ఎంజాయ్ చేశారు: “ఒక సమాజం అంతా కలిసి మెలిసి ఉండటం, ఒకే పెద్ద కుటుంబంలా కలిసి ప్రయాణించడం చూసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. మా సీటు దగ్గర చేరిన వారంతా వేర్వేరు కుటుంబాలకు చెందిన వారు. ఆ 7 గంటల ప్రయాణంలో నాకు ఒక్క నిమిషం కూడా నిద్ర పట్టలేదు, కానీ ఈ అనుభవాన్ని నేను దేనితోనూ మార్చుకోలేను” అని గ్రీన్ వుడ్ రాసుకొచ్చారు.


Posted

in

by

Tags: