‘ప్రధాని మోదీ ఒక్క ఫోన్ కాల్‌తో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగియవచ్చు’: భారత్ శక్తిని గుర్తించిన యూఏఈ!

పశ్చిమ ఆసియా యుద్ధ జ్వాలల్లో కాలిపోతోంది. ఇజ్రాయెల్-అమెరికా కలిసి ఇరాన్‌పై విరుచుకుపడుతుంటే, ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిత్రదేశాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది.

గత 10 రోజులుగా పశ్చిమ ఆసియా రణరంగంగా మారింది. శాంతి నెలకొనే సూచనలు కనిపించని ఈ తరుణంలో, ప్రధాని మోదీ చేసే ఒక్క ఫోన్ కాల్ ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని ఒక్క క్షణంలో ముగించగలదని యూఏఈ నమ్ముతోంది. భారత్‌లో యూఏఈ మొదటి రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.

యుద్ధంలో మాకు ప్రమేయం వద్దు: యూఏఈ స్పష్టత
భారత్‌లో యూఏఈ తొలి రాయబారి హుస్సేన్ హసన్ మీర్జా మాట్లాడుతూ.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలో భాగస్వామి కావాలని తమ దేశానికి ఎలాంటి కోరిక లేదని స్పష్టం చేశారు. ఏ పక్షం కూడా తమ భూభాగాన్ని దాడుల కోసం (Launchpad) ఉపయోగించుకోవడానికి అనుమతించబోమని ఆయన తేల్చి చెప్పారు. ప్రాంతీయంగా యుద్ధం తీవ్రమవుతున్నా, తాము తటస్థంగానే ఉంటామని యూఏఈ వెల్లడించింది.

ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో మీర్జా ఏమన్నారంటే?
అబుదాబికి ఈ యుద్ధంతో ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. “నిజం చెప్పాలంటే, మేము ఇందులో ఎందుకు భాగం కావాలో నాకు అర్థం కావడం లేదు. యూఏఈ ఇందులో చేరడానికి ఎటువంటి కారణం లేదు.” అని ఆయన అన్నారు. అయితే, యూఏఈకి రెండు దేశాలతో సత్సంబంధాలు ఉన్నందున, అవసరమైతే నిర్మాణాత్మక దౌత్య పాత్రను (Diplomatic Role) పోషించగలమని ఆయన సూచించారు.

ప్రధాని మోదీ ప్రభావంపై యూఏఈ ధీమా
మిర్జా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో భారత నాయకత్వ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని నొక్కి చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోదీకి గల్ఫ్ దేశాలలో అమితమైన గౌరవం ఉంది.

రాజకీయ నాయకులే కాకుండా, వ్యాపార వర్గాలు మరియు సామాన్య ప్రజలు కూడా ఆయనను గౌరవిస్తారు.

యుద్ధ ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన ఈ సమయంలో, మోదీకి ఉన్న విశ్వసనీయత ఇటు ఇజ్రాయెల్ మరియు అటు ఇరాన్.. రెండింటిపై ప్రభావం చూపగలదు.

“కేవలం ఒక్క ఫోన్ కాల్.. యుద్ధం ముగియవచ్చు” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


Posted

in

by

Tags: