మధ్యప్రాచ్య దేశాల్లో జరుగుతున్న యుద్ధం వల్ల భారత్ ఇంధన భద్రత, వాణిజ్య మార్గాలపై పడే ప్రభావాన్ని చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 25 సాయంత్రం 5 గంటలకు సర్వపక్ష సమావేశాన్ని పిలిచింది.
భారత్లో ‘ఎనర్జీ లాక్డౌన్’ (ఇంధన ఆంక్షలు) విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ.. కోవిడ్-19 నాటి సరఫరా వ్యవస్థ అంతరాయాలను గుర్తు చేయడంతో ఈ చర్చ మొదలైంది. ఈ లాక్డౌన్లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి వర్క్ ఫ్రమ్ హోమ్ మరియు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
ఎనర్జీ లాక్డౌన్ విధిస్తే భారత్లో పరిస్థితి ఎలా ఉంటుంది?
- వాహనాల రాకపోకలు: ఇంధన రేషన్ (పరిమిత సరఫరా) కారణంగా ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు ఉండవచ్చు.
- వర్క్ ఫ్రమ్ హోమ్: ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మళ్ళీ ఇంటి నుండే పనిచేసే మార్గదర్శకాలు రావచ్చు.
- ఆన్లైన్ క్లాసులు: పాఠశాలలు, కళాశాలలు ఆన్లైన్ విధానానికి మారాలని కోరవచ్చు.
- IPL ఆంక్షలు: ఐపీఎల్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించకపోవచ్చు.
- అనవసర ప్రయాణాలు: అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని ప్రభుత్వం సూచించవచ్చు.
ప్రస్తుత పరిస్థితి:
- పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాల క్యూ కనిపిస్తోంది.
- LPG గ్యాస్: సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతోంది. కొత్త కనెక్షన్లను నిలిపివేశారు, బ్లాక్ మార్కెట్లో ధరలు పెరిగాయి.
- హోటళ్లు, తినుబండారాల కేంద్రాలు గ్యాస్ లేక మూతపడుతున్నాయి.
- పరిస్థితిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఎగుమతుల కంటే దేశీయ అవసరాలకే ప్రాధాన్యత ఇస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన రేషన్ (ఉదాహరణలు):
- శ్రీలంక: వారానికి 4 రోజుల పనిదినాలు, వాహనాలకు క్యూఆర్ కోడ్ ద్వారా వారానికి 15 లీటర్ల పెట్రోల్ మాత్రమే.
- బంగ్లాదేశ్: రోజూ 5 గంటల పాటు కరెంట్ కోతలు, మోటార్ సైకిళ్లకు రోజుకు 2 లీటర్ల పెట్రోల్ మాత్రమే.
- పాకిస్థాన్: ప్రభుత్వ ఉద్యోగులకు 4 రోజుల పనివారమే.
- ఈజిప్ట్: మాల్స్, రెస్టారెంట్లు రాత్రి 9 గంటలకే మూసివేయాలి.
