ప్రపంచంలో అత్యంత వింతైన ప్రదేశం: ఇక్కడ పెళ్లికూతుళ్లను సంతలో వస్తువుల్లా అమ్ముతారు!

నేటి వరకు మీరు బట్టలు, కూరగాయలు, పాదరక్షలు వంటి వస్తువుల సంతలను చూసి ఉంటారు. కానీ, పెళ్లికూతుళ్ల సంతను ఎప్పుడైనా చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ప్రపంచంలో ఒక వింతైన ప్రదేశం ఉంది. అక్కడ మహిళలను ఉల్లిపాయలు, టమోటాల మాదిరిగా వేలం వేసి అమ్ముతారు.

బల్గేరియాలో ఈ వింతైన ‘బ్రైడ్ మార్కెట్’ (వధువుల సంత) జరుగుతుంది. అక్కడ పురుషులు తమకు నచ్చిన మహిళను భార్యగా కొనుగోలు చేస్తారు. బల్గేరియాలోని ‘స్తారా జాగోరా’ (Stara Zagora) ప్రాంతంలో ఈ సంత జరుగుతుంది. ఇక్కడికి పురుషులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి, తమకు నచ్చిన అమ్మాయిని ఎంచుకుంటారు. అమ్మాయి నచ్చిన పక్షంలో, ఆమె కుటుంబం నిర్ణయించిన ధరను చెల్లించి వధువును తీసుకువెళతారు. ఆ తర్వాత సదరు యువతికి ఆ ఇంట్లో భార్య హోదా లభిస్తుంది.

పేదల కోసం ఈ సంత: ఈ వధువుల సంత ప్రధానంగా పేద కుటుంబాల కోసం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల తమ కుమార్తెలకు పెళ్లిళ్లు చేయలేని వారు, ఈ సంతకు తమ అమ్మాయిలను తీసుకువస్తారు. అక్కడ అమ్మాయిల ధరలు వేర్వేరుగా ఉంటాయి.

కొన్ని కీలక నియమాలు: ఈ మార్కెట్‌లో అమ్మాయిని కొనుగోలు చేయడానికి కొన్ని కఠినమైన నియమాలు ఉన్నాయి:

  • అమ్మాయి కన్యాదానం (వర్జిన్) కావాలి, అప్పుడే ఆమెకు ఎక్కువ ధర పలుకుతుంది.
  • ఈ సంతలో కేవలం ‘కలైద్జీ’ (Kalaidzhi) తెగకు చెందిన వారు మాత్రమే తమ కుమార్తెలను తీసుకువస్తారు.
  • కుటుంబం ఆర్థికంగా పేదరికంలో ఉండాలి. ధనవంతులు తమ కుమార్తెలను ఇక్కడ అమ్మడానికి వీల్లేదు.
  • కొనుగోలు చేసిన అమ్మాయిని సదరు కుటుంబం కోడలిగా స్వీకరించి, గౌరవంగా చూసుకోవడం తప్పనిసరి.

బల్గేరియాలో ఈ ఆచారం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతోంది మరియు దీనిని నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి కూడా ఉంది.


Posted

in

by

Tags: