ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన విమాన ఘటనలో అనూహ్య మలుపు.! “గొడ్డలితో భారత కెప్టెన్‌పై పాశవికంగా దాడి చేసిన కో-పైలట్”. అంత పెద్ద ఆయుధాన్ని లోపలికి ఎలా తీసుకెళ్లాడు.? వీడని మిస్టరీ.!!!

ఫ్లైదుబాయ్ (Flydubai) విమానంలో నడిగగనంలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇజ్రాయెల్ వెళ్తున్న ఆ విమానంలోని కో-పైలట్, కాక్‌పిట్‌లో ఉన్న అత్యవసర గొడ్డలిని (Emergency axe) తీసుకుని కెప్టెన్‌పై దాడి చేసినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధికారులు తెలిపారు.

విమానంలో 174 మంది ప్రయాణికులు ఉండగా, అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో వారు భయాందోళనలకు గురయ్యారు. కెప్టెన్‌పై దాడి చేసిన తర్వాత విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు కో-పైలట్ ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటన సమయంలో విమానం అకస్మాత్తుగా వేల అడుగుల కిందకు పడిపోయినట్లు సమాచారం. గాయపడినప్పటికీ కెప్టెన్ కాక్‌పిట్ తలుపు తెరిచాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు, ఇతర సిబ్బంది లోపలికి వెళ్లి కో-పైలట్‌‌ను అదుపు చేశారు. అనంతరం విమానంలో ప్రయాణిస్తున్న మరో పైలట్ విమాన నియంత్రణను తన చేతుల్లోకి తీసుకుని, సౌదీ అరేబియాలోని తబూక్ విమానాశ్రయంలో సురక్షితంగా దించాడు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న యూఏఈ అధికారులు దీనిని “ఉగ్రవాద దాడి కుట్ర”గా పేర్కొన్నారు. కో-పైలట్‌ను హమ్మామ్ అల్-హమ్మామిగా గుర్తించారని, అతను ఒమన్‌ దేశానికి చెందినవాడని సమాచారం. అతను ఈ చర్యకు ఒంటరిగా పాల్పడ్డాడా లేదా మరెవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనకు గల పూర్తి కారణం ఇంకా ధృవీకరించబడలేదు.

కాగా, ఆ కో-పైలట్‌ను గతంలో ఒమన్‌లో విమానాలు నడపకుండా నిషేధించారని, ఆ తర్వాత అతను ఫ్లైదుబాయ్‌లో చేరాడని కొందరు అధికారులు, దర్యాప్తు వర్గాలు తెలిపాయి. కానీ ఈ సమాచారానికి సంబంధించిన పూర్తి నేపథ్యం ఇంకా దర్యాప్తులో ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్నందున తాము అదనపు సమాచారం ఇవ్వలేమని విమానయాన సంస్థ తెలిపింది. నడిగగనంలో 182 మంది ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఈ ఘటన విమానయాన భద్రతపై కూడా అనేక ప్రశ్నలను లేవనెత్తింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *