చైనాకు చెందిన 25 ఏళ్ల లియాంగ్ అనే మహిళ, ‘యురేమియా’ (Uremia) అనే తీవ్రమైన మూత్రపిండ వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న తన 33 ఏళ్ల భర్త ‘సుంగ్’ ప్రాణాలను కాపాడేందుకు తన ఒక మూత్రపిండాన్ని (కిడ్నీని) దానం చేసి అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.
పుట్టుకతోనే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సుంగ్ది ‘ఓ-నెగటివ్’ (O-Negative) బ్లడ్ గ్రూప్ కావడంతో, అతనికి సరిపోయే కిడ్నీ దొరక్క 3 సంవత్సరాల పాటు వేచి చూసినా ఫలితం లేకుండా పోయింది. ఇన్ని సంవత్సరాలు వేచి చూడటానికి సుంగ్ ఆరోగ్యం సహకరించదని వైద్యులు హెచ్చరించారు.
రక్తసంబంధం లేని దంపతుల మధ్య కిడ్నీ మ్యాచ్ అవ్వడం అనేది 10 శాతం కంటే తక్కువగా ఉండే చాలా అరుదైన విషయం. అయినప్పటికీ, తన భర్తను ఎలాగైనా కాపాడుకోవాలని లియాంగ్ పరీక్షలు చేయించుకుంది. ఆశ్చర్యకరంగా ఇద్దరి టిష్యూలు (కణజాలాలు) పక్కాగా మ్యాచ్ అయ్యాయి.
దీంతో గ్వాంగ్జౌ ఆసుపత్రిలో లియాంగ్ యొక్క ఎడమ కిడ్నీని సుంగ్కు విజయవంతంగా అమర్చారు. ప్రస్తుతం అతను పూర్తి ఆరోగ్యంతో కోలుకుని ఇంటికి తిరిగొచ్చాడు.
కిడ్నీ దానం చేసిన తర్వాత వచ్చిన నొప్పులు ప్రసవ వేదన కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, తన భర్త ఆరోగ్యంగా ఉంటే చాలని లియాంగ్ ఆనందం వ్యక్తం చేసింది. ఆమె చేసిన ఈ త్యాగాన్ని నెటిజన్లు విశేషంగా కొనియాడుతున్నారు.

Leave a Reply