ప్రాణ స్నేహితుడి ద్రోహం.. అబ్బాయిని అమ్మాయిగా మార్చిన ఘోరం.. వణికిపోయిన పోలీసులు!

ఉత్తరప్రదేశ్: ముజఫర్ నగర్‌లో మానవత్వాన్ని మంటగలిపేలా అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన ప్రాణ స్నేహితుడిని మోసపూరితంగా నమ్మించి, ఆసుపత్రిలో చేర్పించి, అతనికి తెలియకుండానే లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించాడు.

“నీకు ఒంట్లో బాలేదు, డాక్టర్‌కు చూపిద్దాం” అని చెప్పి స్నేహితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లిన నిందితుడు, అక్కడ ఉన్న వైద్యులతో కుమ్మక్కై ఈ దారుణానికి ఒడిగట్టాడు. శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత బాధితుడు స్పృహలోకి వచ్చి చూసుకోగా, తన పురుషత్వాన్ని కోల్పోయినట్లు తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు.

ఈ అమానుషం అక్కడితో ఆగలేదు. శస్త్రచికిత్స జరిగిన తర్వాత 18 రోజుల పాటు బాధితుడిని ఒక గదిలో బంధించి, ఆ “స్నేహితుడు” నిరంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా, అతడిని పెళ్లి చేసుకుంటానని బెదిరింపులకు కూడా దిగాడు.

ఈ ఘోరమైన ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పవిత్రమైన స్నేహాన్ని అడ్డం పెట్టుకుని ఒక వ్యక్తి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.


Posted

in

by

Tags: