మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి 186 మంది ప్రయాణికులతో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి బయలుదేరిన ‘మలేషియా ఎయిర్‌లైన్స్’ విమానంలో గాల్లో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తింది.
విమానం ప్రయాణిస్తున్న సమయంలో దాని రెండవ ఇంజిన్‌లో లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే అత్యవసర ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
వెంటనే చెన్నై విమానాశ్రయ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) విభాగాన్ని సంప్రదించిన పైలట్, అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. విమానాశ్రయ అధికారుల సమన్వయం, తగిన ముందస్తు భద్రతా చర్యలతో ఆ మలేషియా ఎయిర్‌లైన్స్ విమానం ఎలాంటి ప్రమాదం జరగకుండా చెన్నై విమానాశ్రయంలో సురక్షితంగా అత్యవసర ల్యాండ్ అయింది.
విమానంలో ఉన్న 186 మంది ప్రయాణికులు ఎటువంటి గాయాలూ లేకుండా పూర్తిగా సురక్షితంగా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. ఇంజిన్‌లో ఆకస్మిక లోపం తలెత్తడంతో చెన్నై ఎయిర్‌పోర్టులో కొద్దిసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం నిపుణుల సాంకేతిక బృందం ఆ విమానానికి క్షుణ్ణంగా మరమ్మతులు, తనిఖీలు చేపడుతోంది.

Leave a Reply