ఐటీ హబ్‌గా పేరొందిన పూణే నగరంలో, ప్రియుడితో గొడవ కారణంగా 23 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఖరాడీ పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడిని అరెస్ట్ చేశారు.
మృతి చెందిన యువతిని బీహార్‌కు చెందిన జాన్వీ పాఠక్ (23)గా, అరెస్టయిన ప్రియుడిని నోయిడాలోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఢిల్లీకి చెందిన అమృత్ కుమార్ (23)గా గుర్తించారు. మృతురాలి బంధువు (మామ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
పాఠశాల స్థాయి నుంచే స్నేహితులైన వీరిద్దరూ ఉన్నత చదువుల అనంతరం ఉద్యోగాల నిమిత్తం వేర్వేరు నగరాలకు వెళ్లారు. జాన్వీ రాజస్థాన్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, గత రెండు నెలలుగా పూణేలోని ఖరాడీ ప్రాంతంలో ఉన్న ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తోంది.
సంఘటన జరిగిన కొద్ది రోజుల ముందు నోయిడా నుంచి పూణే వచ్చిన అమృత్ కుమార్, జాన్వీ గదిలో రెండు రోజుల పాటు ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగినట్లు సమాచారం.
శుక్రవారం మధ్యాహ్నం అమృత్ కుమార్ బయటకు వెళ్లిన సమయంలో తీవ్ర మనస్తాపానికి గురైన జాన్వీ, తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ససూన్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, ఈ కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Leave a Reply