ప్రేమ వ్యవహారంలో ఇంతటి దారుణమా.? ఇంజనీరింగ్ విద్యార్థిని మృతి.. లెక్చరర్ అరెస్ట్.. విచారణలో వెలుగుచూసిన సంచలన విషయాలు..!!!

తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి ప్రాంతంలో 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని తాండ్ర అక్షితా రాణి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

ఈ కేసులో 38 ఏళ్ల లెక్చరర్ నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. తొలుత విద్యార్థిని మృతిని ఆత్మహత్యగా భావించినప్పటికీ, తదుపరి జరిపిన లోతైన దర్యాప్తులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నస్పూర్‌లోని సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో గెస్ట్ (ఔట్‌సోర్సింగ్) లెక్చరర్‌గా పనిచేస్తున్న నవీన్ కుమార్‌తో అక్షితా రాణికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో, అక్షిత హైదరాబాద్‌కు వెళ్లి మైనింగ్ ఇంజనీరింగ్ చదువుతుండగా, అక్కడ రవి కుమార్ అనే మరో యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు.

అయితే రవి కుమార్‌తో అక్షిత సన్నిహితంగా ఉండటం నవీన్ కుమార్‌కు నచ్చలేదని, దీంతో ఆమెను హత్య చేయాలని అతడు పథకం వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన ఎఫ్‌సీఐ (FCI) క్రాస్ రోడ్స్ సమీపంలో అక్షితను అడ్డగించి కారులో ఎక్కించుకుని వెళ్లాడని, అక్కడ ఆమెను బెదిరించి బలవంతంగా సూసైడ్ నోట్ (ఆత్మహత్య లేఖ) రాయించాడని విచారణలో తేలింది. ఆ లేఖలో రవి కుమార్‌పై లైంగిక ఆరోపణలు కూడా రాయించినట్లు పోలీసులు వెల్లడించారు.

అనంతరం అక్షితకు విషపదార్థం తాగించాడని, ఆమె ప్రాణాలు విడిచే వరకు నవీన్ కుమార్ అక్కడే వేచి ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత అక్షిత ఫోన్ నుంచే ఆమె తండ్రికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. సీసీటీవీ కెమెరా దృశ్యాలు, ఫోన్ కాల్ రికార్డులు (CDR), ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో ఈ హత్య కేసు గుట్టు రట్టయిందని పోలీసులు వెల్లడించగా, దీనిపై తదుపరి విచారణ కొనసాగుతోంది.


Posted

in

by

Tags: