ప్రేమించవద్దని మందలించిన కాలేజీ ప్రిన్సిపాల్.. విద్యార్థిని ఆత్మహత్య.. తీవ్ర సంచలనం!

తమిళనాడు విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆ విద్యార్థిని ఒక యువకుడిని ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో, ప్రిన్సిపాల్ ఆ విద్యార్థినిని పిలిపించి తీవ్రంగా మందలించారు. అంతటితో ఆగకుండా, విద్యార్థిని తల్లిదండ్రులను కళాశాలకు రప్పించి, వారి ముందే ఈ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టి అవమానించినట్లు సమాచారం. దీనితో తీవ్ర మనస్తాపానికి లోనైన ఆ విద్యార్థిని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు గాను కళాశాల ప్రిన్సిపాల్‌ను మరియు అతనికి సహకరించిన ఆఫీస్ అసిస్టెంట్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరూ కోర్టులో హాజరై, బెయిల్‌పై విడుదలైనట్లు సమాచారం.


Posted

in

by

Tags: