పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని డి-చౌక్ ప్రాంతంలో, కొత్తగా రూపొందించిన రిమోట్ కంట్రోల్ కారు టెస్ట్ డ్రైవ్ జరిగింది.
అబోటాబాద్‌కు చెందిన టెక్నాలజీ నిపుణుడు ఎహసాన్ జాఫర్ రూపొందించిన ఈ కారు గురించి మహమ్మద్ ఆలీజా అనే జర్నలిస్ట్ ప్రజలకు వీడియో ద్వారా వివరిస్తున్నారు. ప్రారంభంలో సజావుగానే సాగిన వాహనం, అకస్మాత్తుగా తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా నియంత్రణ కోల్పోయింది. లోపల కూర్చున్న జర్నలిస్ట్ వెంటనే హ్యాండ్‌బ్రేక్ వేసి కారును ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది; ఆ వాహనం అదుపుతప్పి దూసుకెళ్లి అక్కడే ఉన్న పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టి ఆగింది.
ఆధునిక సాంకేతికతను వెలుగులోకి తెచ్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ ప్రయోగం, ఊహించని ప్రమాదంతో ముగియడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం జరిగిన ఉత్కంఠభరిత దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విడుదలై అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, ఈ వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు.. “పాకిస్తాన్‌లో ప్రతిభావంతులకు కొదవా?” అంటూ వ్యంగ్యమైన, హాస్యభరితమైన క్యాప్షన్లతో ఈ ఘటనను నెట్టింట విపరీతంగా వైరల్ చేస్తున్నారు.

Leave a Reply