ఫిబ్రవరి 1 నుండి ఆర్‌బీఐ కొత్త నిబంధనలు; అప్రమత్తంగా లేకపోతే మీ ఖాతా మాయం కావచ్చు!

భారతదేశంలోని బ్యాంక్ ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠినమైన హెచ్చరిక జారీ చేసింది. 2026 ఫిబ్రవరి 1 నుండి దేశవ్యాప్తంగా బ్యాంకులు ఒక భారీ ప్రచారాన్ని ప్రారంభించనున్నాయి; అదేమిటంటే, ఏళ్ల తరబడి ఎటువంటి లావాదేవీలు లేకుండా పడి ఉన్న బ్యాంక్ ఖాతాలను గుర్తించి వాటిని శాశ్వతంగా మూసివేయడం.

ప్రధానంగా మూడు రకాల ఖాతాలపై ఈ ప్రభావం ఉంటుంది:

  1. ఇన్‌యాక్టివ్ (Inactive) ఖాతాలు: ఒక ఏడాది కాలంగా ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతాలు.
  2. డార్మెంట్ (Dormant) ఖాతాలు: రెండేళ్లకు పైగా నిశ్చలంగా ఉన్న ఖాతాలు.
  3. జీరో బ్యాలెన్స్ ఖాతాలు: ఎటువంటి అవసరం లేకుండా కేవలం తెరిచి ఉంచిన ఖాతాలు.

మీ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ ఉందని లేదా వడ్డీ జమ అవుతుందని భావించి లావాదేవీలు చేయకుండా వదిలేస్తే, ఫిబ్రవరి 1 నుండి ఆ ఖాతా రద్దు కావచ్చు.

ఆర్‌బీఐ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? గడిచిన పదేళ్లలో బ్యాంక్ ఖాతాల సంఖ్య పెరిగినప్పటికీ, వాటిలో సగం ఖాతాలను ఎవరూ వాడటం లేదు. ఇటువంటి ‘సైలెంట్’ అకౌంట్లు సైబర్ నేరగాళ్లకు, మోసగాళ్లకు అడ్డాగా మారుతున్నాయని ఆర్‌బీఐ గుర్తించింది. నల్లధనం లావాదేవీలను అరికట్టడమే దీని ప్రధాన లక్ష్యం. కేవలం మొబైల్ యాప్‌లో లాగిన్ అయితే సరిపోదని, నగదు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేయడం లేదా ట్రాన్స్‌ఫర్ చేస్తేనే అకౌంట్ యాక్టివ్‌గా పరిగణించబడుతుందని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: