బంగారం ధర ₹1 లక్ష తగ్గింది.. ఒక్క ట్వీట్‌తో షాక్ ఇచ్చిన నిపుణుడు..!!

బంగారం ధరలు వరుసగా మూడవ రోజు కూడా తగ్గడమే కాకుండా, రాబోయే రోజుల్లో ఇంకా భారీగా పడిపోతాయని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది తమకు వచ్చిన లాభంతో బంగారాన్ని విక్రయించి మార్కెట్ నుండి బయటకు వస్తున్నారు. అయితే, ఇదే సమయంలో సంపన్నుల ఆలోచనా విధానానికి, పేదల ఆలోచనా విధానానికి మధ్య ఉన్న తేడాను ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి తన తాజా ట్వీట్ ద్వారా వివరించారు.

రాబర్ట్ కియోసాకి ఏమన్నారంటే? “వాల్‌మార్ట్ వంటి స్టోర్లలో డిస్కౌంట్ సేల్ పెడితే పేదలు పరుగెత్తుకెళ్లి వస్తువులు కొంటారు. కానీ ఫైనాన్షియల్ మార్కెట్ కుప్పకూలి ‘సేల్’ (ధరల తగ్గింపు) వస్తే మాత్రం, పేదలు భయపడి తమ వద్ద ఉన్నవాటిని అమ్మేసి పారిపోతారు. కానీ ధనికులు మాత్రం ఆ సమయంలోనే పరుగెత్తుకెళ్లి కొనుగోలు చేస్తారు” అని ఆయన పేర్కొన్నారు. బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరల పతనాన్ని ఆయన ఒక గొప్ప ‘సేల్’గా అభివర్ణించారు. “మార్కెట్ పడిపోయింది. నేను డబ్బుతో సిద్ధంగా ఉన్నాను. బంగారం, వెండి, బిట్‌కాయిన్ కొనేందుకు రెడీగా ఉన్నాను. మరి మీరు ఏం చేయబోతున్నారు?” అని ఆయన ప్రశ్నించారు.

మార్కెట్ పరిస్థితి: వెండి ధరలు కూడా దారుణంగా పడిపోవడంతో ఈటీఎఫ్ (ETF) ఇన్వెస్టర్లు కన్నీరు పెడుతున్నారు. ఏదైనా ఆస్తి విలువ తగ్గినప్పుడు, అది స్వల్ప కాలంలో లేదా దీర్ఘకాలంలో తిరిగి తన గరిష్ట స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. అందుకే ధరలు తగ్గినప్పుడు కొనాలని కియోసాకి సూచిస్తున్నారు. మార్కెట్ క్రాష్ అనేది ధనికులకు ఒక సువర్ణావకాశం అని ఆయన అభిప్రాయం.

సామాన్యులకు గుణపాఠం: మార్కెట్ పడిపోయినప్పుడు భయపడకుండా నాణ్యమైన ఆస్తులను కొనడం ధనికుల అలవాటు. అయితే అందరూ దీనిని చేయలేరు, ఎందుకంటే మార్కెట్ కోలుకోవడానికి చాలా సమయం పట్టవచ్చు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి.

బంగారం ధర ₹1 లక్ష పతనం: గత కొద్దివారాలుగా బంగారం ధరలు పెరుగుతాయని భావించి అప్పులు చేసి, క్రెడిట్ కార్డుల ద్వారా బంగారం కొన్నవారు ఇప్పుడు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. నేడు రిటైల్ మార్కెట్‌లో 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా ₹1,03,700 మేర తగ్గింది


Posted

in

by

Tags: