అమెరికా కేంద్ర బ్యాంకు (Fed) సమావేశం గత రెండు రోజులుగా జరుగుతోంది. వడ్డీ రేట్లపై వారు తీసుకునే నిర్ణయం కోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. ఈ నిర్ణయమే భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయో నిర్ణయిస్తుంది.
మూడు రకాల అవకాశాలు – బంగారం ధరపై ప్రభావం:
1. సానుకూల వైఖరి (బంగారం ధర పెరగవచ్చు):
ఈసారి వడ్డీ రేట్లు తగ్గించరని దాదాపు స్పష్టమైంది. అయితే, 2026 నాటికి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని ఫెడ్ సంకేతాలిస్తే, డాలర్ బలహీనపడుతుంది. దీనివల్ల అప్పటికే గరిష్ట స్థాయిలో ఉన్న బంగారం ధరలు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది.
2. తటస్థ వైఖరి (ధరలో మార్పు ఉండదు):
వడ్డీ రేట్లను మార్చకుండా, భవిష్యత్తులో ఎప్పుడు తగ్గిస్తామనే విషయంపై స్పష్టత ఇవ్వకుండా ఫెడ్ మౌనంగా ఉంటే, బంగారం ధరలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయి. పెద్దగా పెరగడం కానీ, తగ్గడం కానీ జరగదు.
3. కఠిన వైఖరి – హాకిష్ (ధరలు తగ్గే అవకాశం):
ప్రస్తుతానికి వడ్డీ రేట్ల తగ్గింపు ఆలోచన లేదని చెబుతూ, ద్రవ్యోల్బణంపై హెచ్చరికలు జారీ చేస్తే దానిని ‘హాకిష్’ వైఖరి అంటారు. ఇలాంటి సమయంలో డాలర్ విలువ పెరుగుతుంది. ఫలితంగా బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిలో గ్రాముకు ₹300 నుండి ₹400 వరకు ధర తగ్గే ఛాన్స్ ఉంది.
రేపు మార్కెట్లో అలజడి ఖాయం!
అమెరికా సమయం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు (భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి) ఈ నిర్ణయాలు వెలువడతాయి. దీని ప్రభావం రేపు ఉదయం భారత మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. ఫెడ్ నిర్ణయం ఏదైనప్పటికీ, రేపు బంగారం ధరల్లో పెద్ద ఎత్తున హెచ్చుతగ్గులు (సుడిగాలిలా) ఉండే అవకాశం ఉంది.
