సూడాన్‌లోని ఒక బంగారు గనిలో సంభవించిన హఠాత్ ప్రమాదంలో చిక్కుకుని 60 మందికి పైగా కార్మికులు దారుణంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
గని లోపలి భాగాలు ఒక్కసారిగా కుంగిపోయి కూలిపోవడంతో, అక్కడ పని చేస్తున్న కార్మికులందరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. చాలామంది మట్టిలో ఆతుతుగా పూడిపోవడంతో, వారిని వెలికితీసేందుకు యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ, శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుని ఉండవచ్చని భావిస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. సరైన భద్రతా సౌకర్యాలు లేకుండా నిర్వహించడమే ఈ ప్రమాదానికి కారణమా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం కాగా, అక్కడి కార్మికుల కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి.

Leave a Reply