మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నివసిస్తున్న 22 ఏళ్ల వివాహిత మరియు ఆమె 17 ఏళ్ల సోదరికి ఎదురైన ఒక భయంకరమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అసలేం జరిగిందంటే? ఆ సోదరీమణులు ఇద్దరూ గుడికి వెళ్లి రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో ఆ మహిళకు వరుసకు సోదరుడయ్యే (Cousin) బంధువు మరియు అతని స్నేహితుడు అమన్ ఖాన్ వారికి ఎదురయ్యారు. “చాలా ఆలస్యమైంది, మేము మిమ్మల్ని ఇంటి దగ్గర దింపుతాము” అని నమ్మబలికి రక్షణ ఇస్తున్నట్లుగా నటించి వారితో కలిసి ఇంటికి వెళ్లారు.
సదరు సోదరీమణులను ఇంటి దగ్గర దింపిన తర్వాత, “బయట చాలా చీకటిగా ఉంది, ఈ రాత్రికి ఇక్కడే ఉంటాము” అని చెప్పి వారిని ఒప్పించారు. అక్కడే భోజనం చేసి పడుకున్నారు. అయితే, అర్ధరాత్రి వేళ ఆ కిరాతకులు ఇద్దరూ అక్కాచెల్లెళ్లను ప్రాణ భయంతో బెదిరించి వారిపై అత్యాచారానికి ఒడిగట్టారు.
మరుసటి రోజు ఉదయం, “మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాం, ఊరికి వెళ్లడానికి డబ్బు కావాలి” అని మాయమాటలు చెప్పి, ఆ మహిళల దగ్గర ఉన్న ₹40,000 నగదు మరియు వెండి పట్టీలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
