బాబోయ్. ఇలా కూడా జరుగుతుందా..? ఎంత పెద్ద మంచి నీళ్ల ట్యాంకో. భయంకరంగా పేలి చిన్నాభిన్నమైంది. వరద నీటిలా మారిన ఊరు.. గాల్లోకి ఎగిరిపడిన ఉద్యోగి. సంచలన వీడియో.!!!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లా, శాండి పట్టణంలో ఉన్న మున్సిపల్ మంచి నీళ్ల ట్యాంకులో మంగళవారం హఠాత్తుగా సంభవించిన ప్రమాదం వల్ల భారీగా నీరు వృథా అయి, ఆ ప్రాంతమంతా వరదలా మారిపోయింది.

అయితే, అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగి అదృష్టవశాత్తూ తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు.

అంటే ఆ పరిధిలోని ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేయడానికి అక్కడ ఒక భారీ మంచి నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో, మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో పైపులో ఏర్పడిన లీకేజీని బాగుచేసే పనిలో మున్సిపల్ ఉద్యోగి అయిన సంసూల్ నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో, ఊహించని విధంగా మంచి నీళ్ల ట్యాంకు నుండి అత్యంత వేగంగా నీటి ఒత్తిడి పెరిగింది.

ఈ తీవ్రమైన నీటి ఒత్తిడిని తట్టుకోలేక, ట్యాంకు యొక్క మెయిన్ వాల్వ్ ప్లేట్ పెద్ద శబ్దంతో పేలి చిన్నాభిన్నమైంది. దీంతో, ట్యాంకు నుండి రాకాసి జలపాతంలా నీరు అత్యంత వేగంగా బయటకు వచ్చి నలువైపులా విరుచుకుపడింది. ఇందులో లీకేజీని బాగుచేస్తున్న ఉద్యోగి సంసూల్, నీటి తీవ్రమైన వేగానికి గాల్లోకి ఎగిరిపడే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ, ఆయన వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి అక్కడి నుండి తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

వాల్వ్ పేలిపోవడంతో రోడ్లపై భారీగా నీరు చేరి వరదలా కనిపించింది. ఈ సంఘటనను చూసిన ఆ ప్రాంత ప్రజలు అక్కడ గుమిగూడటంతో తీవ్ర కలకలం రేగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ అధికారులు, నీటి సరఫరాను వెంటనే నిలిపివేసి, వాల్వ్‌ను బాగుచేసే పనిని వేగవంతం చేశారు. మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత పట్టణానికి తాగునీటి సరఫరా పునరుద్ధరించబడుతుందని అధికారులు తెలిపారు.


Posted

in

by

Tags: