“బాబోయ్! ఒక్క పన్ను పొడవే 8.5 అంగుళాలా?”.. 10,000 ఏళ్ల నాటి ఏనుగుల పూర్వీక జీవి దంతాలు.. బయటపడ్డ చారిత్రక సంపద..!!!

అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో సుమారు 10,000 సంవత్సరాల క్రితం నాటి ‘పసిఫిక్ మాస్టోడాన్’ (Pacific Mastodon) అనే అరుదైన పురాతన జీవి దంతాలు (శిలాజాలు) బయటపడ్డాయి.

ప్రస్తుత కాలం నాటి ఏనుగులకు పూర్వీకులుగా భావించే ఈ వింత జీవులు.. దాదాపు 11,700 సంవత్సరాల క్రితమే భూమ్మీద నుంచి పూర్తిగా అంతరించిపోయినట్లు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

లభ్యమైన ఈ పురావస్తు దంతం సుమారు 8.5 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు కలిగి ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇన్ని వేల సంవత్సరాలు గడిచినప్పటికీ, ఈ జీవి దంతాలు ఎలాంటి చెక్కుచెదరకుండా అత్యంత పదిలంగా, సంపూర్ణ స్థితిలో లభించడం పరిశోధకులను విస్మయానికి గురిచేస్తోంది.

చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ అరుదైన ఆవిష్కరణకు సంబంధించిన వివరాలు, ఛాయాచిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. సైన్స్, చరిత్ర సంబంధిత అంశాలపై ఆసక్తి చూపే నెటిజన్ల మధ్య ఈ పురాతన దంతాల వెలికితీత ప్రధాన చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags: