బాలికల శరీరాలపై ఉన్న ఆ వాక్యాల అర్థమేంటి? ఎప్‌స్టీన్ మరియు 70 ఏళ్ల నాటి ‘లోలిత’ నవల మధ్య ఉన్న భయంకర లింక్!

జెఫ్రీ ఎప్‌స్టీన్.. అమెరికాకు చెందిన ఒక విలాసవంతమైన బిలియనీర్. సామాన్య నేపథ్యం నుండి వచ్చి అమెరికాలోని ఎలైట్ వర్గాల్లో (అగ్రశ్రేణి వ్యక్తులు) పట్టు సాధించిన ఇతని జీవితం ఒక రహస్య మిషన్ లాంటిది. దశాబ్దాల పాటు డబ్బు, అధికారం మరియు పలుకుబడిని అడ్డం పెట్టుకుని మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు, సెక్స్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను నడిపాడు. డిసెంబర్ 19న అమెరికా ప్రభుత్వం ఎప్‌స్టీన్‌కు సంబంధించిన రహస్య ఫైళ్లను బహిర్గతం చేయనుంది. దీనికి ముందే డెమొక్రాట్ ఎంపీలు 68 కొత్త ఫోటోలను విడుదల చేశారు. ఇందులో అందరి దృష్టిని ఆకర్షించింది ‘లోలిత’ (Lolita).

జెఫ్రీ ఎప్‌స్టీన్ మరియు ‘లోలిత’ మధ్య సంబంధం ఏమిటి?

ఈ రెండింటి మధ్య ఉన్నది ఒకటే పోలిక.. అది వికృత ఆలోచన. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పీడోఫైల్ (బాలలపై లైంగిక వాంఛ కలవాడు)గా పేరుపొందిన ఎప్‌స్టీన్, వ్లాదిమిర్ నోబోకోవ్ రాసిన వివాదాస్పద నవల ‘లోలిత’ నుండి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది.

తాజాగా బయటకు వచ్చిన ఫోటోలలో నగ్నంగా ఉన్న మైనర్ బాలికల శరీరాలపై ‘లోలిత’ నవలకు సంబంధించిన వాక్యాలు రాసి ఉన్నాయి. ఒక ఫోటోలో బాలిక కాలి వద్ద ఆ నవల కూడా కనిపిస్తోంది. బాలికల మెడ, ఛాతి, కాళ్లు మరియు పొట్ట భాగాలపై ఈ వాక్యాలను కోట్ చేశారు.

  • ఉదాహరణకు: ఒకచోట “She was Lo, plain Lo, in the morning…” అని, మరోచోట “Lo-lee-ta: the tip of the tongue taking a trip…” అని రాసి ఉంది.

ఈ వాక్యాల అర్థం ఏమిటంటే: “ఆమె ఉదయం పూట కేవలం Lo.. స్కూల్లో డాలీ.. ప్రభుత్వ కాగితాల్లో డోలోరెస్.. కానీ నా బాహువుల్లో (కౌగిలిలో) మాత్రం ఆమె కేవలం లోలిత.” “లో-లి-తా.. ఆ పేరు పలుకుతుంటేనే నాలుక నోట్లో నాట్యం చేస్తుంది, ఒక కోరిక నెమ్మదిగా రూపుదిద్దుకుంటున్నట్లు ఉంటుంది.”

ఏంటీ ‘లోలిత’ నవల?

1955లో వ్లాదిమిర్ నోబోకోవ్ రాసిన ఈ నవల అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక మధ్య వయస్కుడు 12 ఏళ్ల బాలిక పట్ల ఆకర్షితుడై, ఆమెను పొందేందుకు ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టడమే ఈ నవల సారాంశం. దీనిలోని అసభ్యత కారణంగా అప్పట్లో అనేక దేశాలు ఈ పుస్తకాన్ని నిషేధించాయి. ఎప్‌స్టీన్ కేసులో కూడా మైనర్ బాలికలను వేధించడం ప్రధానాంశం కాబట్టి, ఆ బాలికల శరీరాలపై ఈ వాక్యాలను రాయడం అతని వికృత మనస్తత్వానికి నిదర్శనం.

పోలిక ఎందుకు?

లోలిత నవలలోని హంబర్ట్ అనే పాత్ర తన నేరాన్ని అందమైన పదాల వెనుక దాచడానికి ప్రయత్నిస్తాడు. అలాగే ఎప్‌స్టీన్ కూడా మోడలింగ్, మసాజ్ మరియు మెంటార్‌షిప్ వంటి పదాలను వాడుతూ లైంగిక వేధింపులను ఒక సాధారణ విషయంగా చిత్రించడానికి ప్రయత్నించాడు. రెండు సందర్భాల్లోనూ బాధితుల గొంతు నొక్కేసి, నేరస్తుడి కోణంలోనే కథ నడుస్తుంది. అందుకే ‘లోలిత’ నేడు కేవలం ఒక నవల మాత్రమే కాదు, అధికారం మరియు భాష సహాయంతో దోపిడీని దాచే ఒక వికృత మనస్తత్వానికి చిహ్నంగా మారింది.

ప్రముఖుల పేర్లు: ఈరోజు విడుదలైన ఫైళ్లలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ నుండి గూగుల్ కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్, ప్రఖ్యాత దార్శనికుడు నోమ్ చోమ్స్కీ వంటి హేమాహేమీల పేర్లు ఉన్నాయి. అయితే ఎప్‌స్టీన్ నేరాల్లో వీరికి నేరుగా ప్రమేయం ఉందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, వీరితో ఎప్‌స్టీన్‌కు ఉన్న సంబంధాల గురించి ప్రపంచం చర్చించుకుంటోంది.


Posted

in

by

Tags: