బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న 26 ఏళ్ల కార్పొరేట్ ఉద్యోగి శివాంజలి.. సెప్టెంబర్ నెలలో తన ఖర్చుల వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
స్నేహితులతో కలిసి మూడు బెడ్రూమ్ల ఇంట్లో ఉంటున్న ఆమె.. అద్దె, మెయింటెనెన్స్ కోసం నెలకు రూ.25 వేలు ఖర్చు చేసింది.
ఆహారం కోసం కూడా భారీగానే ఖర్చయింది. ఆఫీసులోనే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేయడంతో కొంత ఖర్చు తగ్గినా.. రాత్రి భోజనం కోసం వంట మనిషికి రూ.2 వేలు, కిరాణా, ఇంటి అవసరాలకు మరో రూ.3 వేలు ఖర్చు చేసింది.
స్నేహితులతో కలిసి బయట తినడం, ఫుడ్ ఆర్డర్ చేయడం వంటి వాటికి సుమారు రూ.12 వేలు ఖర్చయ్యాయి. పెట్రోల్‌కు రూ.3 వేలు, అవసరమైనప్పుడు ఆటో, క్యాబ్‌ల కోసం మరో రూ.4 వేలు ఖర్చు చేసింది.
జిమ్, ఏఐ టూల్స్, క్లౌడ్ స్టోరేజ్, ఓటీటీ వంటి సబ్స్క్రిప్షన్లకు మరో రూ.6 వేలు వెళ్లాయి.
ఇక వ్యక్తిగత అవసరాలు, షాపింగ్ తదితర ఖర్చులు కలిపితే.. సెప్టెంబర్ నెలలో ఆమె మొత్తం ఖర్చు రూ.63 వేలకు చేరింది.
ఈ ఖర్చుల లెక్క చూసిన తనకే కొంత భయమేసిందని శివాంజలి చెప్పింది. ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొందరు ఇది బెంగళూరు వంటి నగరాల్లో సాధారణ జీవన వ్యయమేనని చెబుతుండగా.. మరికొందరు ఖర్చులతో పాటు పొదుపు, పెట్టుబడులపై కూడా దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

Leave a Reply