లండన్: టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన తన గాయానికి సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఆయన ముఖం కుడి వైపు వాచిపోయి, ఆకృతి పూర్తిగా మారిపోయి కనిపిస్తోంది.
మీడియా నివేదికల ప్రకారం, స్టోక్స్‌కు ఈ గాయం మ్యాచ్ ఆడుతున్నప్పుడు కాలేదు, ప్రాక్టీస్ సెషన్లో జరిగింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా ఆయన పక్కకు నిలబడి మాట్లాడుతున్న సమయంలో, అనుకోకుండా బంతి వేగంగా వచ్చి ఆయన ముఖానికి తగిలింది. ఆ సమయంలో బంతిని ఆయన గమనించకపోవడంతో, దానిని అడ్డుకోలేకపోయారు.
ఇన్‌స్టా స్టోరీ షేర్ చేసిన స్టోక్స్ గాయపడిన తన ముఖం ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన స్టోక్స్, హాస్యంగా స్పందిస్తూ.. “నా ముఖం ఇలా ఉంటే, మరి ఆ క్రికెట్ బంతి పరిస్థితి ఎలా ఉందో మీరు చూడాలి” అని రాశారు. ప్రస్తుతం స్టోక్స్ ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టుకు దూరంగా ఉండటంతో, రాబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో ఆయన భాగం కావడం లేదు. 2022 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన స్టోక్స్, ఆ తర్వాత 2024 వరల్డ్ కప్‌లో కూడా జట్టులో లేరు.
యాషెస్ సమయంలో కూడా గాయం 2025-26 యాషెస్ సిరీస్ సమయంలో కూడా ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నడుము గాయంతో బాధపడ్డారు. ఆ గాయం నుండి కోలుకుంటున్న తరుణంలోనే, ఇప్పుడు ముఖానికి దెబ్బ తగలడం ఆయనకు మరిన్ని ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
బెన్ స్టోక్స్ అంతర్జాతీయ కెరీర్ బెన్ స్టోక్స్ ఇప్పటివరకు 120 టెస్టులు, 114 వన్డేలు మరియు 43 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. టెస్టుల్లో 7216 పరుగులు చేసి 245 వికెట్లు తీశారు. వన్డేల్లో 3463 పరుగులు మరియు 74 వికెట్లు పడగొట్టారు. టీ20 ఇంటర్నేషనల్స్‌లో 585 పరుగులు మరియు 26 వికెట్లు సాధించారు.
