బైకులపై వచ్చి సాయుధ ముఠాల దాడి.. 50 మంది దుర్మరణం!

పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలోని జంఫారా (Zamfara) రాష్ట్రం సమీపంలోని తుంగన్ దత్సే (Tungan Dutse) గ్రామంపై సాయుధ ముఠా సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు.

స్థానిక విలేకరుల సమాచారం ప్రకారం.. బైకులపై వచ్చిన సాయుధ దుండగులు గ్రామంలోని ఇళ్లను తగులబెట్టారు. ప్రాణభయంతో ప్రజలు తప్పించుకోవడానికి ప్రయత్నించగా, వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దారుణమైన దాడిలో కనీసం 50 మంది మరణించగా, అనేక మంది మహిళలు మరియు పిల్లలను దుండగులు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. చాలా మంది ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గల్లంతయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడి నైజీరియా వాయువ్య ప్రాంతంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిని మరోసారి బయటపెట్టింది.


Posted

in

by

Tags: