‘బ్యాంకులు భారంగా మారుతున్నాయి’.. 54 వేల కోట్ల దోపిడీపై CJI సూర్యకాంత్ దిగ్భ్రాంతి

డిజిటల్ మోసాల ద్వారా ఏకంగా 54 వేల కోట్ల రూపాయల ప్రజా ధనం దుర్వినియోగం కావడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కేవలం మోసం మాత్రమే కాదని, వ్యవస్థీకృత “దోపిడీ మరియు దౌర్జన్యం” అని కోర్టు అభివర్ణించింది. సోమవారం జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ (RBI), బ్యాంకులు మరియు టెలికాం శాఖలు కలిసి ఈ సమస్యను అరికట్టడానికి ఒక పటిష్టమైన గైడ్ లైన్స్ (SOP) రూపొందించాలని ఆదేశించింది.

ముఖ్య అంశాలు:

  • బ్యాంకుల బాధ్యత: సాధారణంగా నెలకు 10-20 వేల రూపాయలు డ్రా చేసే పెన్షనర్లు లేదా సామాన్యుల ఖాతాల నుండి అకస్మాత్తుగా లక్షలాది రూపాయలు బదిలీ అవుతుంటే బ్యాంకులు ఎందుకు అలర్ట్ చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది.
  • చిన్న రాష్ట్రాల బడ్జెట్ కంటే ఎక్కువ: సైబర్ నేరగాళ్లు కాజేసిన 54 వేల కోట్లు కొన్ని చిన్న రాష్ట్రాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువని పీఠం వ్యాఖ్యానించింది. బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం లేదా కుమ్మక్కు లేకుండా ఇంతటి పెద్ద దోపిడీ జరగదని ధ్వజమెత్తింది.
  • AI వాడకం: అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరికరాలను ఎందుకు వాడటం లేదని ఆర్బీఐని కోర్టు నిలదీసింది.
  • డిజిటల్ అరెస్ట్ ప్రమాదం: పోలీసులమంటూ బెదిరించి ప్రజలను ‘డిజిటల్ అరెస్ట్’ చేసే కేసులపై సీబీఐ (CBI) దేశవ్యాప్త విచారణ జరపాలని, బాధితులకు నష్టపరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Posted

in

by

Tags: