భద్రతకు ఇదో విచిత్ర మార్గమా..? “రైలు తలుపు దగ్గర కూర్చుంటే కుక్క తరుముతుంది..!” ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే తీసుకున్న వింత నిర్ణయం..!!

పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో తీసినదిగా చెప్పబడుతున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

రైలు మెట్లపైన, తలుపుల వద్ద కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణించే ప్రయాణికులను ప్రమాదాల నుండి కాపాడేందుకు రైల్వే యంత్రాంగం ఒక కొత్త విచిత్రమైన ప్రచారాన్ని ప్రారంభించింది.

ఈ పథకం కింద, శిక్షణ పొందిన కుక్కలు తమ విధిని నిర్వహించేలా, కదులుతున్న రైలు తలుపుల వద్ద ట్రాక్‌ను ఆనుకుని నిరంతరం పరిగెడుతున్నాయి.

ప్రయాణికులు భయపడి రైలు తలుపుల దగ్గర కూర్చోకుండా ఉండటానికి, చేతులు కాళ్ళు బయటకు పెట్టకుండా చేయడానికి కుక్కలు ఈ విధంగా వెంటపడేలా ఏర్పాట్లు చేశారు.

రైల్వే తీసుకున్న ఈ విచిత్రమైన చర్యను కొందరు స్వాగతిస్తూ ప్రశంసిస్తుండగా, మరికొందరు ప్రయాణికులు మరియు కుక్కల భద్రతను ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *