కర్ణాటక రాష్ట్రంలోని విరాజ్‌పేట (వీరాపేట) ప్రాంతంలో శుక్రవారం రాత్రి వినాయక ఊరేగింపులో జరిగిన ఘోర ప్రమాదంలో, విద్యుదాఘాతానికి గురై ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ఊరేగింపు వాహనంలో అమర్చిన డీజే (DJ) సెట్‌కు ప్రమాదవశాత్తు పైన ఉన్న విద్యుత్ తీగ తగలడంతో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో వాహనంలోకి ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించడంతో అందులో ఉన్నవారు ఎగిరిపడ్డారు; కొందరికి కాలిన గాయాలు కూడా అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో బసవరాజుతో సహా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన చికిత్స కోసం మైసూరు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు మడికేరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
సమాచారం అందగానే జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (SP) బిందుమణి, ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మరోవైపు, విరాజ్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఏ.ఎస్. పొన్నణ్ణ ఆసుపత్రికి నేరుగా వెళ్లి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.

Leave a Reply