“భర్త ఇంట్లోనే ఉండగానే డబుల్ ఎఫైర్!” రెండో ప్రియుడి తల పగలగొట్టిన వైనం.. వెలుగులోకి పూంగొడి లీలలు.. విచారణలో దిగ్భ్రాంతికర నిజాలు.!!

చెన్నై తాంబరం సమీపంలోని ఆలపాక్కం ప్రాంతానికి చెందిన రమేష్ (47) అనే వ్యక్తి ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతినడంతో మంచానికే పరిమితమయ్యాడు.

దీన్ని ఆసరాగా చేసుకున్న అతని భార్య పూంగొడి (45), ఇంటికి అద్దె కారు డ్రైవర్‌గా వచ్చిన రాయపురం వాసి దామోదరన్ (33)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఇదిలా ఉండగా.. 9 నెలల క్రితం ఇంటి గేటు రిపేరు చేసేందుకు వచ్చిన తాంబరం వెల్డర్ జయశంకర్ (38)తోనూ పూంగొడికి పరిచయం ఏర్పడి, అది కూడా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఒకేసారి ఇద్దరితో సంబంధం కొనసాగిస్తున్న సమయంలో.. గత కొద్దిరోజులుగా జయశంకర్ ఆమెపై లైంగికంగా విపరీతమైన ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పూంగొడి, తన మొదటి ప్రియుడైన దామోదరన్‌ను ఇంటికి పిలిపించింది.

ఇద్దరూ కలిసి ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో జయశంకర్ తలపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం జయశంకర్ మేడపై నుంచి కింద పడిపోయాడంటూ 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి నాటకమాడారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న జయశంకర్‌ను చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చేర్చారు. పోలీసులు జరిపిన లోతైన విచారణలో వీరిద్దరి అసలు రంగు బయటపడటంతో, పూంగొడి, దామోదరన్‌లను పీర్కన్‌కారనై పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.


Posted

in

by

Tags: