“భవిష్యత్తులో కలెక్టర్లు కావాల్సిన అమ్మాయిలు…” స్కూల్లో విద్యార్థినుల మద్యం సేవనం… వీడియో వైరల్! హెడ్మాస్టర్ పై బదిలీ వేటు… తమిళనాడులో తీవ్ర కలకలం!

తమిళనాడులోని తక్కలై ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో కొందరు విద్యార్థినులు స్కూల్ ఆవరణలోనే మద్యం సేవించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై (హెడ్మాస్టర్) విద్యాశాఖ బదిలీ వేటు వేసింది.

పోటీ పరీక్షల ప్రత్యేక శిక్షణ తరగతుల కోసం పాఠశాలకు వచ్చిన కొందరు విద్యార్థినులు, మిగతా విద్యార్థులంతా వెళ్లిపోయిన తర్వాత స్కూల్ ప్రాంగణంలోనే మద్యం సేవించినట్లు విచారణలో తేలింది. సదరు విద్యార్థినుల మగ స్నేహితుడొకరు పాఠశాలకు మద్యం సీసాలు, ఆహారాన్ని తెచ్చి ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో ఉన్నతాధికారులు హెడ్మాస్టర్‌ను తక్షణమే బదిలీ చేశారు. అలాగే ఈ వ్యవహారంపై తక్కలై పోలీసులు సంబంధిత విద్యార్థినులు, పాఠశాల ఉపాధ్యాయులను సమగ్రంగా విచారిస్తున్నారు.

విద్యాసంస్థలు ఉన్న పరిసరాల్లోని దుకాణాల్లో మద్యం, మత్తు పదార్థాల విక్రయాలు అడ్డూఅదుపు లేకుండా సాగకుండా కఠిన తనిఖీలు చేపట్టాలని స్థానిక ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *