“భారత్‌కు పెను ముప్పు..!” చైనా నిర్మిస్తున్న భారీ డ్యామ్‌తో రానున్న భారీ వరదలు.. చైనా శాస్త్రవేత్తలే ఇచ్చిన షాకింగ్ హెచ్చరిక..!!

పొరుగు దేశమైన చైనా నియంత్రణలో ఉన్న టిబెట్‌లో జన్మించే యార్లంగ్ త్సాంగ్పో నది, భారత సరిహద్దుల్లోకి ప్రవేశించగానే బ్రహ్మపుత్రా నదిగా పిలువబడుతుంది.

ఈ నదికి అడ్డంగా భారత సరిహద్దుకు సమీపంలోని మెడోగ్ అనే లోయ ప్రాంతంలో 1,600 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ను చైనా నిర్మిస్తోంది.

ఈ డ్యామ్ నిర్మాణం జరిగితే భారత్‌కు తీవ్ర వరద ముప్పు పొంచి ఉందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మరియు యునాన్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరించారు.

డ్యామ్‌లో లక్షలాది లీటర్ల నీటిని నిల్వ ఉంచినప్పుడు, భారీ వర్షాలు కురిసే సమయంలో అకస్మాత్తుగా గేట్లు తెరిస్తే.. భారత్, బంగ్లాదేశ్ ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయి.

అంతేకాకుండా, ఈ ప్రాంతం తరచుగా భూకంపాలకు గురయ్యేది కావడం, హిమానీనదాలు (మంచుకొండలు) వేగంగా కరిగిపోతుండటం వల్ల నేపాల్‌లో సంభవించిన తరహాలో భారీ విపత్తు వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *