భారత్‌ను దూషించిన ముస్లిం ఎంపీని పార్లమెంట్ నుండి బయటకు పంపేశారు.. షాక్‌లో మద్దతుదారులు!

లండన్: భారత్‌పై విషం చిమ్ముతూ, అనుచిత వ్యాఖ్యలు చేసే పాకిస్థానీ సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీకి పార్లమెంట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను సభ నుండి వెలుపలికి పంపడమే కాకుండా, సస్పెండ్ కూడా చేశారు. ఈ పాకిస్థానీ సంతతి మహిళా ఎంపీ ‘ఆపరేషన్ సింధూర్’ విషయంలో పాకిస్థాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన చరిత్ర కలిగి ఉంది.

ఈమె కాశ్మీర్‌లో ముస్లింలపై అరాచకాలు జరుగుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా అజెండాను నడుపుతుంటుంది. కానీ వాస్తవానికి కాశ్మీర్ నుండి హిందువులే వెళ్లగొట్టబడ్డారు. నేటికీ హిందువులు అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలంటే సైనిక భద్రత అవసరమవుతోంది. అటువంటిది, ఈ ఎంపీ వంటి వారు ముస్లింలే బాధితులని ప్రచారం చేస్తుంటారు. గతంలో భారత్‌లో రైతు ఉద్యమం జరిగినప్పుడు కూడా ఈమె తీవ్ర స్థాయిలో విషం చిమ్మింది. అయితే, చేసిన కర్మ ఫలం అనుభవించక తప్పదు అన్నట్లు.. ఈమె ఇప్పుడు బహిరంగంగా చీవాట్లు తిని పార్లమెంట్ నుండి గెంటివేయబడింది. ఈ పాకిస్థానీ సంతతి బ్రిటీష్ ఎంపీ పేరు జరా సుల్తానా.

అసలేం జరిగింది? బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ జరా సుల్తానా అక్కడి ప్రధానమంత్రి కియర్ స్టార్మర్‌ను ‘అబద్ధాలకోరు’ (Liar) అని సంబోధించింది. దీనిపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని అలా అనడం నిబంధనలకు విరుద్ధమని హెచ్చరిస్తూ, ఆమెను సభ నుండి వెళ్లగొట్టారు. ఆ వెంటనే ఆమెను సభ నుండి సస్పెండ్ చేశారు.

కియర్ స్టార్మర్ పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని నెరవేర్చలేదనే కోపంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ముస్లింలు పెద్ద ఓటు బ్యాంకుగా మారడంతో అక్కడి రాజకీయ నాయకులు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, సాక్షాత్తు ప్రధానమంత్రి పదవిని అవమానించే స్థాయికి వెళ్లడంతో బ్రిటన్ పార్లమెంట్ దీనిని సహించలేకపోయింది.

భారతదేశ పరిస్థితులతో పోలిక: ఈ ఘటనను భారత సందర్భంతో పోల్చి చూస్తే.. భారత్‌లో కూడా ముస్లింలను ఒక ఓటు బ్యాంకుగా చూస్తారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారత్‌లో కొందరు రాజకీయ నాయకులు, మతోన్మాదులు లేదా వామపక్షవాదులు ప్రతిరోజూ ప్రధానమంత్రి మోదీని దూషిస్తూనే ఉంటారు. ప్రధానిని తిట్టడం, బెదిరించడం వంటివి ఇక్కడ సర్వసాధారణంగా మారాయి. కానీ బ్రిటన్ వంటి దేశాల్లో పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడటానికి కఠిన చర్యలు తీసుకుంటారని ఈ ఘటన నిరూపించింది.


Posted

in

by

Tags: