సోషల్ మీడియాలో ఒక వీడియో ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక వ్యక్తి తన భార్యను అద్దెకు ఇస్తానంటూ బహిరంగంగా ప్రకటించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తన భార్య ఖర్చులను తాను భరించలేకపోతున్నానని, అందుకే ఆమెను అద్దెకు ఇస్తున్నానని ఆ వ్యక్తి ఆ వీడియోలో పేర్కొన్నాడు.
బంధాలను బజారున పడేసిన వైనం: నిత్యావసరాల ధరలు పెరిగి ఇల్లు గడవడం కష్టమవుతున్న మాట నిజమే అయినప్పటికీ, ఒక వ్యక్తి తన భార్యను అద్దెకు ఇవ్వడం అనేది సభ్య సమాజం తలదించుకునే విషయం. భార్య అంటే ఒక వస్తువు కాదు, ఆమె ఒక ప్రాణం ఉన్న మనిషి. పెళ్లి సమయంలో ఏడు అడుగులు వేసి, అన్ని కష్టసుఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసిన వ్యక్తి, ఇప్పుడు ఆ బంధానికి ఉన్న పవిత్రతను కాలరాశాడు.
సోషల్ మీడియాలో విమర్శల వెల్లువ: ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు వ్యక్తిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
- ఒక యూజర్ “ఇతను భర్త కాదు, దళారీ” అని కామెంట్ చేయగా..
- మరొకరు “ఇది ఏ రకమైన సంస్కృతి? భార్యను గౌరవించాల్సింది పోయి ఇలా అద్దెకు ఇవ్వడమేంటి?” అని ప్రశ్నించారు.
- “కలికాలం అంటే ఇదేనేమో, ఏదైనా జరగొచ్చు” అని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.
- ఇలాంటి వ్యక్తిని భార్య వెంటనే వదిలేసి ఇల్లు వెళ్లగొట్టాలని పలువురు సలహా ఇచ్చారు.
