చెన్నైలోని రెడ్‌హిల్స్ (సెంగుండ్రం) సమీప ప్రాంతానికి చెందిన రత్నవేల్ పాండియన్ (40) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అయితే, కుటుంబంలో వచ్చిన మనస్పర్థల కారణంగా భార్యాపిల్లలు అతడిని విడిచిపెట్టి వేరుగా నివసిస్తున్నారు.
ఈ ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకున్న రత్నవేల్ పాండియన్‌కు, తన బావమరిది అయిన శరవణన్ (39) భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన శరవణన్, రత్నవేల్ పాండియన్‌ను పలుమార్లు కలిసి తీవ్రంగా హెచ్చరించాడు. అయినప్పటికీ ఎలక్ట్రీషియన్ దేనినీ లెక్కచేయకుండా ఆ వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన శరవణన్, అతడిని ఎలాగైనా మట్టుబెట్టాలని తన అనుచరులతో కలిసి పక్కా పథకం వేశాడు.
పథకం ప్రకారం, నిన్న ఉదయం 10 గంటల సమయంలో రత్నవేల్ పాండియన్ బైక్‌పై వెళ్తుండగా.. శరవణన్, అతని తమ్ముడు ధనశేఖర్ (34), బంధువు పళనిస్వామి (45) కలిసి అతడిని అడ్డుకున్నారు. వెంట తెచ్చుకున్న కొడవళ్లతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేసి నరికేశారు. శరీరంపై తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడిపోయిన రత్నవేల్ పాండియన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. హత్యానంతరం నిందితులు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చెన్నై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ప్రత్యేక బృందం పోలీసులు.. పరారీలో ఉన్న శరవణన్, ధనశేఖర్, పళనిస్వామిలను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. పట్టపగలే బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని వేటాడి నరికి చంపిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీసింది.
