సోషల్ మీడియా ప్రపంచంలో కొన్ని నిజ జీవిత కథలు సంవత్సరాలు గడిచినా ప్రజల మనసుల్లో ముద్ర వేస్తాయి. ‘క్వోరా’ (Quora) ప్లాట్‌ఫారమ్‌లో ఉన్న ఒక పాత పోస్ట్ ప్రస్తుతం మళ్లీ వైరల్ అవుతోంది. ఈ ఘటన దాదాపు ఐదేళ్ల క్రితం జరిగినప్పటికీ, ఇప్పటికీ ప్రజలు దీని గురించి చర్చించుకుంటూనే ఉన్నారు.
ఇది నమ్మకద్రోహం, సహనం మరియు ఒక అసాధారణ నిర్ణయానికి సంబంధించిన కథ. ఒక వ్యక్తి తన భార్య గర్భవతి అని తెలిసి ఎంతో సంతోషించాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఆమె గర్భంలో ఉన్న బిడ్డ తనది కాదని, తన భార్య ప్రియుడిదని తెలిసి అతను కుప్పకూలిపోయాడు. భార్యతో గొడవలు ఉన్నప్పటికీ, బంధాన్ని కాపాడుకోవాలని అతను భావించాడు. కానీ ఈ నిజం తెలిసిన తర్వాత అతను ఏం చేశాడంటే…
హృదయం ముక్కలైన క్షణం: దంపతుల మధ్య గొడవలు ఉన్నప్పటికీ వారి వైవాహిక జీవితం సాధారణంగానే సాగుతోంది. అకస్మాత్తుగా భార్య గర్భవతి అని చెప్పడంతో భర్త ఎంతో మురిసిపోయాడు. కానీ కొన్ని రోజుల తర్వాత, తన భార్యకు వేరొక వ్యక్తితో సంబంధం ఉందని, ఆ బిడ్డకు తండ్రి తను కాదని తెలిసి అతనికి షాక్ తగిలింది. తన భార్య తనతో పాటు ఆ ప్రియుడితో కూడా సంబంధం కొనసాగిస్తోందని, ఆ బిడ్డను పెంచాలని ప్రియుడు కూడా కోరుకుంటున్నాడని ఆమెనే స్వయంగా అతనికి చెప్పింది.
తీసుకున్న ఆశ్చర్యకరమైన నిర్ణయం: ఈ నిజం తెలిసిన తర్వాత ఆ వ్యక్తి తీవ్రమైన బాధ, అవమానం, కోపానికి లోనయ్యాడు. కానీ, ఏమాత్రం ఆవేశపడకుండా, ఎలాంటి హింసకు తావు లేకుండా అతను ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు. బిడ్డ సురక్షితంగా జన్మించే వరకు భార్యను కంటికి రెప్పలా చూసుకున్నాడు. డెలివరీ అయ్యాక, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడని నిర్ధారించుకున్నాడు.
ఆ తర్వాతే అసలైన ట్విస్ట్! బిడ్డ పుట్టిన వెంటనే అతను విడాకుల ప్రక్రియను ప్రారంభించాడు. “ఈ బిడ్డ నీకు, నీ ప్రియుడికి పుట్టిన వాడు, దీని బాధ్యత నేను తీసుకోను” అని భార్యకు స్పష్టంగా చెప్పాడు. ఆ తర్వాత ప్రియుడిని పిలిపించి, అన్ని ఆధారాలను (మెసేజ్‌లు, ఫోటోలు, వాంగ్మూలం) చూపి, బిడ్డను అతని అప్పగించాడు. కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాడు. ఎలాంటి ఆస్తి గొడవలు లేకుండా, నిశ్శబ్దంగా తన దారిన తాను వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఐదేళ్ల తర్వాత, అతను తన కొత్త జీవితంలో, తన ఇద్దరు కుమార్తెలతో ఎంతో సంతోషంగా ఉన్నానని, ఆ సమయంలో తనను సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు అని తెలిపాడు. ఈ కథ ఎంతో మందికి స్పూర్తినిస్తోంది.
