భార్యకు వరుస సర్జరీలు, 10 రోజుల పోరాటం తర్వాత కన్నుమూసిన భర్త.. ఒక మైనర్ నిర్లక్ష్యం ఆ కుటుంబాన్ని నాశనం చేసింది!

భార్య మీనల్ పటేల్‌కు ఇప్పటికే పలు శస్త్రచికిత్సలు జరిగాయి, వైద్యుల బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తోంది. అయితే, ఆమె భర్త ధ్రుమిల్ పటేల్ 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయారు. ఫిబ్రవరి 5న ధ్రుమిల్ తన భార్యతో కలిసి స్కూటర్ పై ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన తీరు: ముంబైలోని విద్యావిహార్ ప్రాంతంలో ఫిబ్రవరి 5వ తేదీ అర్థరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్‌కోపర్ నివాసి అయిన 33 ఏళ్ల ధ్రుమిల్ ప్రేమ్‌జీ పటేల్ తన భార్యతో కలిసి స్కూటర్‌పై వెళ్తుండగా, సోమయ్య కాలేజీ సమీపంలో ఎదురుగా అతివేగంతో వచ్చిన ఒక SUV కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి ఇద్దరూ రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.

చికిత్స పొందుతూ మృతి: ధ్రుమిల్ గత 10 రోజులుగా వెెంటిలేటర్ సాయంతో ప్రాణాలు నిలుపుకున్నారు. కానీ ఆదివారం ఆయన పరిస్థితి విషమించి మరణించారు. ఆయన భార్య మీనల్ పటేల్‌కు కాళ్లు, చేతులు మరియు పెల్విక్ ఎముకకు సర్జరీలు జరిగాయి. ఆమె పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉంది.

మైనర్ తండ్రిపై కేసు: పోలీసు విచారణలో ఆ SUV కారును ఒక 17 ఏళ్ల మైనర్ నడుపుతున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో తిలక్ నగర్ పోలీసులు మైనర్ తండ్రి వల్జీ రాజా భూషణ్ (43)పై మోటార్ వాహనాల చట్టం మరియు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసులు నమోదు చేశారు.


Posted

in

by

Tags: