హర్యానా రాష్ట్రం పల్వాల్ జిల్లాలో స్నేహ బంధాన్నే కలుషితం చేసేలా ఒక దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
గాడ్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో సాగర్ అనే వ్యక్తి, తన ప్రాణ స్నేహితుడు ఇంట్లో లేని సమయాన్ని చూసి, అతని భార్యను తుపాకీతో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాను వరుసకు “వదిన” అని పిలిచే మహిళపైనే సాగర్ ఇలాంటి పైశాచిక చర్యకు ఒడిగట్టడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ఫిబ్రవరి 6న జరిగిన ఈ ఘటన తర్వాత, ఈ విషయం ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని అతను బెదిరించాడు. దీంతో ఆ మహిళ తీవ్ర భయాందోళనకు గురై మౌనంగా ఉండిపోయింది. అయితే ఆమె మానసిక వేదనను గమనించిన కుటుంబ సభ్యులు ఆరా తీయగా, కన్నీళ్లతో అసలు నిజం బయటపెట్టింది. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆ ‘స్నేహితుడు’ సాగర్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
