భార్యపై అనుమానం.. కోపంతో ఘోరానికి ఒడిగట్టిన భర్త..! మహిళ అంతరంగిక ఫోటోలు ఇంటర్నెట్‌లో లీక్.. షాకింగ్ బ్యాక్‌గ్రౌండ్..!!

కటిహార్ (బీహార్): కన్నకూతురి వయసున్న భార్యపై అనుమానంతో, ఆమెకు సంబంధించిన అత్యంత వ్యక్తిగత మరియు అభ్యంతరకరమైన ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసినందుకు దయాంత్ కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లోని కటిహార్ జిల్లాలో వెలుగుచూసింది.

గత 2023లో వీరికి వివాహం కాగా, తన భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందనే బలమైన అనుమానం దయాంత్ కుమార్‌కు ఏర్పడింది. ఈ క్రమంలో భార్య పరువు తీయాలనే కుట్రపూరిత ఉద్దేశంతో.. ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత దయాంత్ కుమార్ కొన్ని నెలల పాటు పరారయ్యాడు.

బాధిత మహిళ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా గాలించి, పరారీలో ఉన్న దయాంత్ కుమార్‌ను ఎట్టకేలకు పట్టుకున్నారు. అరెస్టు అనంతరం పోలీసుల విచారణలో అతను తన నేరాన్ని ఒప్పుకున్నాడు. తన భార్యకు పెళ్లికి మించిన సంబంధం ఉందని, ఆమె వేరే వ్యక్తితో పారిపోయిందని భావించిన కోపంలోనే ఈ వికృత పనికి ఒడిగట్టానని తెలిపాడు. అంతేకాకుండా, “నేను చాలా పెద్ద తప్పు చేశాను” అని పోలీసుల ఎదుట విచారణలో లబోదిబోమన్నాడు.

అరెస్ట్ చేసిన దయాంత్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అందులోని అభ్యంతరకర ఫోటోలను ఫోరెన్సిక్ ల్యాబ్ (Frenisic Lab) పరీక్షల కోసం పంపించారు. ఈ డేటాను అతను మరెక్కడైనా షేర్ చేశాడా లేదా మొబైల్ నుండి డిలీట్ చేశాడా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి చట్టవిరుద్ధమైన, అసాంఘిక పనులకు పాల్పడే వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని సైబర్ డిఎస్పీ ఆసిఫ్ ఆలమ్ హెచ్చరించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం జైలుకు తరలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *