ప్రస్తుతం ‘వధ్ 2’ సినిమాతో వార్తల్లో నిలిచిన 66 ఏళ్ల నీనా గుప్తా, తన నిక్కచ్చిగా మాట్లాడే తత్వానికి ప్రసిద్ధి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అమ్మాయిల వర్జినిటీ గురించి ఆమె మాట్లాడుతూ.. “నేటి కాలంలో కూడా అబ్బాయిలకు పెళ్లికి వర్జిన్ అమ్మాయిలే కావాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పెళ్లి విషయంలో మారని మనస్తత్వాలు: శుభంకర్ మిశ్రా పాడ్కాస్ట్లో నీనా గుప్తా మాట్లాడుతూ.. “అబ్బాయిలకు పెళ్లి చేసుకోవడానికి వర్జిన్ అమ్మాయిలే కావాలి. పురుషులు పెళ్లి సమయంలో ఇదే చూస్తారు. వారికి ఏ పరిస్థితిలోనైనా సరే కుటుంబంలో సర్దుకుపోయే అమ్మాయి కావాలి. ఇది ఎప్పటి నుండో వస్తోంది, నేటికీ మారలేదు” అని అన్నారు.
కోడళ్లు ఇప్పటికీ తలపై ముసుగు వేసుకుని.. సమాజం మారిందని హోస్ట్ అన్నప్పుడు, నీనా గుప్తా స్పందిస్తూ.. “ఎక్కడ మారింది? ఏ భారత్ గురించి మీరు మాట్లాడుతున్నారు? మన దేశంలో ఇప్పటికీ కోడళ్లు తలపై ముసుగు వేసుకుని, ఉదయాన్నే మామగారి కాళ్లు మొక్కుతున్నారు. మనం ఇంకా చాలా మారాల్సి ఉంది” అని తన కుటుంబంలోని కొన్ని ఉదాహరణలను కూడా చెప్పారు.
నీనా గుప్తా నటించిన ‘వధ్ 2’ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఇందులో సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలో నటించారు.
