కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలో, పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి ఒక యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, ఆమెను హత్య చేయడమే కాకుండా.. మృతదేహంతో లైంగిక దాడికి పాల్పడిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలత్తూరు ప్రాంతంలో ఇనుప పనుల వర్క్‌షాప్ నడుపుతున్న వైశాఖన్ (36) అనే వ్యక్తి ఈ వికృత చేష్టకు పాల్పడి పోలీసులకు చిక్కాడు.
అసలు ఏం జరిగిందంటే? ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన వైశాఖన్, తనకు పెళ్లయిన విషయాన్ని దాచిపెట్టి అదే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల యువతితో కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగించాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ఒత్తిడి చేయడంతో, ఆమెను అడ్డు తొలగించుకోవాలని వైశాఖన్ ఒక దారుణమైన పథకం వేశాడు. ఘటన జరిగిన రోజున ఆ యువతిని తన వర్క్‌షాప్‌నకు పిలిచిన వైశాఖన్, “మనం ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందాం” అని నమ్మబలికాడు.
పాశవిక చర్య: దీనిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆ యువతిని వైశాఖన్ ఆగ్రహంతో గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్నాక, తనలోని వికృత బుద్ధిని బయటపెడుతూ ఆమె శవంతో లైంగిక దాడికి (Necrophilia) పాల్పడ్డాడు. ఆ తర్వాత, ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని ఉరి వేలాడదీశాడు. అనంతరం తన భార్యకే ఫోన్ చేసి, ఎవరో తన వర్క్‌షాప్‌లో ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం ఇచ్చాడు.
పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి.. ఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ దృశ్యాలు మరియు పోలీసుల లోతైన విచారణలో వైశాఖన్ చేసిన దారుణం బయటపడింది. నిందితుడిపై అత్యాచారం, హత్య మరియు మృతదేహాన్ని అగౌరవపరచడం వంటి వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం అతడిని జైలుకు తరలించారు.
