మరణించిన కుమార్తెతో 4 రోజులు తండ్రి చేసిన పని.. ఊరంతా తెలిసినా బయటపెట్టని కుటుంబం.. పోలీసుల హెచ్చరిక తర్వాతే అసలు ట్విస్ట్..!!

హైదరాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో, మరణించిన మహిళ మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించకుండా ఇంట్లోనే ఉంచిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

యేసురత్నం కుటుంబం గత 40 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారు. ఇతని కుమార్తె శైలజ (46) అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 13న మరణించారు. ఆమె మృతదేహాన్ని వెంటనే దహనం చేయకుండా, ఒక ఫ్రిజ్‌లో ఉంచి కుటుంబ సభ్యులు నిరంతరం ప్రార్థనలు చేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది.

రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంటి నుండి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి విచారించగా, ఇది తమ వ్యక్తిగత విషయమని, ప్రార్థన ముగిసిన తర్వాత తమకు ఇష్టమైనప్పుడు అంత్యక్రియలు చేస్తామని ఆ కుటుంబ సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు.

చివరికి, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మృతదేహాన్ని తరలించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించిన తర్వాత, వారు మృతదేహాన్ని తమ సొంత ఊరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించడానికి అంగీకరించారు. ఆ కుటుంబ సభ్యులు ఎవరితోనూ ఎక్కువగా కలవరు అని, గత కొద్దిరోజులుగా వారి ప్రవర్తన వింతగా ఉందని స్థానికులు చెబుతున్నారు.


Posted

in

by

Tags: