తమిళనాడులోని కడలూరు: బైక్పై వెళ్తున్న మహిళలను వెంబడించి, అసభ్య పదజాలంతో వేధించిన ఇద్దరు యువకులను ఇద్దరు మహిళలు ధైర్యంగా పట్టుకుని, దేహశుద్ధి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ ఘటనపై ఆ మహిళలు మీడియాతో మాట్లాడుతూ ఇలా వివరించారు: “ఈరోజు మా నాన్నగారి ఫ్రెండ్స్ రీయూనియన్ వేడుక ముగించుకుని మేము బైక్పై వస్తుండగా, మరో బైక్పై ఇద్దరు యువకులు మమ్మల్ని వెంబడించారు. మా పక్కనే వస్తూ వినలేని విధంగా అత్యంత అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. మొదట పట్టించుకోకుండా వదిలేద్దామనుకున్నాం.”
“కానీ వారు మరింత రెచ్చిపోయి అసభ్యంగా ప్రవర్తించారు. ‘ఏంట్రా మాట్లాడుతున్నారు?’ అని నిలదీస్తే వెటకారంగా నవ్వారు. దీంతో మేము వారిని వెంబడించాం. మమ్మల్ని చూసి తప్పించుకోవడానికి యూ-టర్న్ తీసుకుని వేగంగా వెళ్తూ ఒక గల్లీ చివర బైక్ స్కిడ్ అయి కింద పడిపోయారు. వెంటనే మేము వారిని పట్టుకుని కొట్టడం మొదలుపెట్టాం.”
మహిళల సాహసం:
“నేను నా వ్యక్తిగత కోపం కోసం వారిని కొట్టలేదు. ఈరోజు నన్ను అన్నవాడు రేపు మరో అమ్మాయిని అనకూడదనే బుద్ధి చెప్పాను. మేము వారిని కొడుతుంటే కొందరు మాకు మద్దతు ఇచ్చారు, మరికొందరు ‘అబ్బాయిలను ఎందుకు కొడుతున్నారు?’ అని అడిగారు. మేము కొడుతున్నా వారు సిగ్గులేకుండా అసభ్యంగానే మాట్లాడుతున్నారు. వీడియో తీస్తుంటే వద్దు అని బ్రతిమలాడారు. ఆ తర్వాత వారు అక్కడి నుండి పారిపోయారు. వారు వదిలేసిన బైక్ను పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశాం. పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నాం.”
ఆ వీడియోలో ఒక మహిళ వీడియో తీస్తుండగా, మరో మహిళ ఆ యువకులపై విరుచుకుపడింది. “ఒక అమ్మాయిని చూసి అంత మాట అంటావా? కాళ్ళ మీద పడు.. మీ వయసెంత? మమ్మల్ని చూసి అలాంటి మాట అంటావా?” అంటూ వారిని చితక్కొట్టారు.
బ్లూ సత్తై మారన్ ప్రశంస:
ఈ ఘటనపై సినీ విమర్శకుడు బ్లూ సత్తై మారన్ స్పందిస్తూ: “అసభ్య చేష్టలు, చిన్న చిన్న వేధింపులను భరిస్తూ వదిలేయడం వల్లే అవి లైంగిక వేధింపులు, దాడుల వరకు వెళ్తున్నాయి. ఇలాంటి ఆకతాయిలకు తగిన బుద్ధి చెప్పిన ఈ మహిళల వలె అందరూ ధైర్యంగా ఉండాలి” అని కొనియాడారు.

Leave a Reply