‘మా నాన్న ఒప్పుకోరు’ – అమ్మాయి మాట వినగానే, కదులుతున్న రైలులో సింధూరం దిద్దిన ప్రేమికుడు! వీడియో వైరల్!

కదులుతున్న రైలులో ప్రయాణికులకు ఒక వింత అనుభవం ఎదురైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఒక యువకుడు అకస్మాత్తుగా తన ప్రేయసి నుదుట సింధూరం దిద్దడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సింధూరం దిద్దిన వెంటనే ఆ అమ్మాయి నవ్వుతూ, “మా నాన్న ఒప్పుకోరు” అని అనడం వీడియోలో వినిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో పెద్ద చర్చకు దారితీసింది.

రైలు బోగీయే పెళ్లి పీటగా.. వైరల్ వీడియోలో ఒక జంట రైలులో పక్కపక్కనే కూర్చుని కనిపిస్తున్నారు. ఒక్కసారిగా యువకుడు తన జేబులో నుండి సింధూరం తీసి అమ్మాయికి దిద్దుతాడు. ఇది చూసి పక్కనున్న ప్రయాణికులు నివ్వెరపోయారు. ఒక ప్రయాణికుడు ఈ దృశ్యాన్ని తన కెమెరాలో రికార్డ్ చేశాడు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ జంట ఎవరు అనే విషయాలపై ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్: ఈ వీడియోను @AnjaliLearn అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేయగా, లక్షలాది మంది వీక్షించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “తండ్రి ఒప్పుకోరని తెలిసినప్పుడు మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు?” అని ఒకరు, “ఇదంతా డ్రామా” అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, ఈ వీడియో నెటిజన్లను బాగా అలరిస్తోంది.


Posted

in

by

Tags: