“మాకు న్యాయం కావాలి!”.. ధనిక మహిళ నిర్లక్ష్యానికి బలైన చిన్నారి.. నడిరోడ్డుపై గుండెలు పగిలేలా విలపిస్తున్న తల్లి.. భగ్గుమన్న స్థానికులు..!!

ముంబైలోని బాంద్రా ప్రాంతంలో గల సెయింట్ జాన్ బాప్టిస్ట్ రోడ్డులో ఆడుకుని ఇంటికి తిరిగి వస్తున్న అన్ష్ గుప్తా అనే 8 ఏళ్ల బాలుడిని అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

45 ఏళ్ల మేఘా రావల్ అనే న్యూట్రిషనిస్ట్ (పోషకాహార నిపుణురాలు) సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ తీవ్ర నిర్లక్ష్యంతో తన ఎస్‌యూవీ (SUV) కారును నడుపుతూ ఈ ప్రమాదానికి కారణమైంది. కారు చక్రాలు బాలుడిపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్ వెంటనే రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు పరీక్షించి అప్పటికే ఆ బాలుడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, కారు నడిపిన మేఘాను అరెస్ట్ చేశారు. తమ ఒక్కగానొక్క కుమారుడిని కోల్పోయి.. ‘ఇకపై మమ్మల్ని అమ్మా, నాన్నా అని పిలిచే దిక్కు లేకుండా పోయింది’ అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన దృశ్యాలు చూపరుల కంటతడి పెట్టించాయి. ఏ తప్పూ చేయకుండా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న తమ బిడ్డ అకాల మరణానికి తగిన న్యాయం జరగాలని బాలుడి తండ్రి అరవింద్ గుప్తా కన్నీటి పర్యంతమవుతూ డిమాండ్ చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *